విషయం ఏదైనా కానీ కన్వీన్స్ అయ్యేలా మాట్లాడటంలో దిట్ట అయిన తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిభ ఏమిటో అందరికి తెలిసిందే. తాజాగా ఆయన మరో ఘనత సాధించారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు ముఖ్య పథకాలకు కేంద్ర దన్ను భారీగా లభించనుంది. పీనాసి ప్రధానిగా పేరొంది.. రాష్ట్రాలకు సాయం అందించే విషయంలో గీచిగీచి మరీ సాయం అందిస్తారన్న పేరున్న మోడీని సైతం ప్రభావితం చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది.
మోడీని ప్రభావితం చేసే ఆయన మానసపుత్రిక నీతిఅయోగ్ ను తన విధానాలతో కన్వీన్స్ చేసిన కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయకు కేంద్రం సాయం అందించాలంటూ సిఫార్సు చేయటం పెద్ద విషయంగా చెప్పాలి. ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథకు కేంద్రం రూ.19,200 కోట్లు ఇవ్వటంతో పాటు.. చెరువుల పునరుద్ధరణ కోసం రూపొందించిన మిషన్ కాకతీయ పథకానికి రూ.5వేల కోట్లు ఇవ్వాలంటూ నీతి అయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాలు కోరే నిధులకు సంబంధించి నీతి అయోగ్ సిఫార్పులే కీలకమంటూ మోడీ సర్కారు చెబుతున్న వేళ.. కేసీఆర్.. తన వ్యూహాత్మక పథకాలకు కేంద్రం నుంచి భారీ సాయం పొందేందుకు వీలుగా నీతి అయోగ్ తీసుకున్న తాజా నిర్ణయం కేసీఆర్ కు మరింత కలిసి రావటం ఖాయమని చెప్పాలి. వీటితో పాటు.. వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై నీతిఅయోగ్ సానుకూలంగా స్పందించింది. నీతిఅయోగ్ చెప్పినట్లుగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం కానీ భారీగా నిధులు ప్రకటిస్తే.. కేసీఆర్ కలల ప్రాజెక్టులు మరింత వేగంతో ముందుకు సాగటం ఖాయం.