ఏపీ త‌మ్ముడికి కేసీఆర్ ఫోన్ చేయించారట‌

Update: 2017-07-03 09:47 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు చాలా చిత్రంగా ఉంటుంద‌న్న‌ది తెలిసిందే. ఎవ‌రైనా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు తెలంగాణ ఇష్యూల గురించి మాట్లాడితే.. ముందు నీ సంగ‌తి చూసుకోవ‌చ్చుగా.. అంటూ ఎట‌కారం చేసేస్తారు. మ‌రి.. అలాంటి కేసీఆర్‌.. త‌న‌కు.. త‌న పార్టీకి.. ఆ మాట‌కు వ‌స్తే త‌న రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేని నేత‌ల గురించి ప‌ట్టించుకుంటారా? వారి మాట‌ల్లో త‌ప్పులు దొర్లితే ఫోన్ చేయించి మ‌రీ స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇప్పిస్తారా? అన్న ప్ర‌శ్న వేస్తే.. ఆ అవ‌కాశం ఉండ‌ద‌నే చెబుతారు ఎవ‌రైనా. కానీ.. కేసీఆర్ తీరు వేరు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రియాక్ట్ కావ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్యం.

తాజాగా చోటు చేసుకున్న ఒక ప‌రిణామ‌మే దీనికి నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. ఏపీ అధికార‌ప‌క్షానికి చెందిన సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు. గ‌తంలో కేసీఆర్ రాజ‌కీయాల్లో కొత్త‌గా వ‌చ్చే స‌మ‌యానికి గాలి వారి హ‌వా ఒక రేంజ్లో సాగేది. సీనియ‌ర్ నేత‌గా ఆయ‌న హ‌డావుడి అంతా ఇంతా కాదు

కానీ.. కాల‌క్ర‌మంలో ఆయ‌నకు అవ‌కాశాలు క‌లిసి రావ‌టం లేదు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌క కొన్నిసార్లు.. గెలిచినా.. స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా మంత్రిగా అయ్యే ఛాన్స్ మాత్రం రావ‌టం లేదు. ఇటీవ‌ల ఏపీ విప‌క్ష ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మీద గాలి ముద్దుకృష్ణ‌మ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

ఆ విమ‌ర్శ‌ల తీవ్ర‌త ఎంత ఎక్కువ‌గా ఉందంటే... కొన్ని మీడియా సంస్థ‌లు హైద‌రాబాద్ ఎడిష‌న్ లోనూ ఈ వార్త‌ను క‌వ‌ర్ చేశాయి. దీంతో.. ఈ వార్త కేసీఆర్ దృష్టిలో ప‌డింది. తాజాగా ఒక స‌మావేశం సంద‌ర్భంగా త‌నతో ఉన్న నేత‌ల్ని ఉద్దేశించి.. గాలి ముద్దుకృష్ణ‌మ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చార‌ట కేసీఆర్‌. తాను అసెంబ్లీకి కొత్త‌గా వ‌చ్చిన వేళ‌కే గాలి సీనియ‌ర్ నేత అని.. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూశాన‌ని.. అవేమీ ఆయ‌న స్థాయికి త‌గ్గ‌ట్లుగా లేవ‌ని.. ఆ విష‌యాన్ని ఆయ‌న‌కు చెప్పాల్సిందిగా స‌హ‌చ‌ర నేత‌ల‌తో చెప్పార‌ట‌.

దీంతో.. స‌మావేశం ముగిసిన త‌ర్వాత‌.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి స్వ‌యంగా గాలి ముద్దు కృష్ణ‌మ‌కు ఫోన్ చేశారు. అన్నా.. ఇప్పుడే సీఎంతో స‌మావేశం జ‌రిగింద‌ని.. ఆ సంద‌ర్భంగా మీ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారంటూ అస‌లు విష‌యాన్ని చెప్పార‌ట‌. రోజా మీద చేసిన వ్యాఖ్య‌లు మీ స్థాయికి త‌గిన‌ట్లుగా లేవ‌ని సీఎం చెప్ప‌మ‌న్న‌ట్లుగా గాలి దృష్టికి తీసుకెళ్లార‌ట‌. దీనిపై గాలి హ్యాపీగా ఫీల్ అవుతూ.. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు మాట్లాడ‌క త‌ప్ప‌ద‌ని.. లేక‌పోతే ప్ర‌త్య‌ర్థులు చెప్పేవే ప్ర‌జ‌ల్లోకి వెళ‌తాయ‌ని చెప్పార‌ట‌. చూస్తుంటే.. కేసీఆర్ మాటల‌ మ‌ర్మాన్ని ముద్దుకృష్ణ‌మ ప‌ట్టుకున్న‌ట్లు లేదు క‌దూ. ఏమైనా త‌న‌కు అనుంబంధం ఉన్న నేత‌ల్ని విభ‌జ‌న త‌ర్వాత కూడా కేసీఆర్ ప‌ట్టించుకోవ‌టం.. త‌న స‌ల‌హాలు వారికి చేరేలా చేయ‌టం విశేషంగా చెప్పాలి. కానీ.. ఫీడ్ బ్యాక్‌ను తెలుగు త‌మ్ముళ్లు స‌రైన రీతిలో రిసీవ్ చేసుకున్న‌ట్లుగా క‌నిపించ‌ట్లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News