ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్ర‌మాణం.. స్పీక‌ర్ ఆయ‌న‌కే!

Update: 2019-01-17 08:06 GMT
ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌క‌న్న‌ట్లుగా.. ఎన్నిక‌లు పూర్త‌యి.. ఫ‌లితాలు వెల్ల‌డైన నెల తర్వాత ఎమ్మెల్యేలుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసే అద్భుత అవకాశం తెలంగాణ ఎమ్మెల్యేల‌కు ద‌క్కింది. పీడ దినాలు పూర్తి అయిన నేప‌థ్యంలో.. ఈ రోజు (గురువారం) ఉద‌యం 11.30 గంట‌ల‌కు తెలంగాణ రెండో అసెంబ్లీ కొలువు తీరింది. తాత్కాలిక స్పీక‌ర్ గా ముంతాజ్ అహ్మ‌ద్ ఖాన్ అధ్య‌క్ష‌త‌న స‌భ స్టార్ట్ అయ్యింది.

కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత స్పీక‌ర్ ప్ర‌మాణ స్పీక‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం చేయిస్తున్నారు.ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. తెలుగులో ఆయ‌న త‌న ప్ర‌మాణ‌స్వీకారాన్ని పూర్తి చేశారు. మ‌హిళా స‌భ్యుల్లో రేఖా నాయ‌క్.. బానోతు హ‌రిప్రియ నాయ‌క్ లు ఇంగ్లిషులో ప్ర‌మాణం చేయ‌గా.. మిగిలిన వారంతా తెలుగులో ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న స‌మ‌యానికి  ప‌లువురు ఎమ్మెల్యేలు ప్ర‌మాణ‌స్వీకారం చేయాల్సి ఉంది.

ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్  ఎవ‌ర‌న్న దానిపై గ‌డిచిన కొద్ది రోజులుగా సాగుతున్న స‌స్పెన్స్ తొల‌గిపోయింది. తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గా సీనియ‌ర్ ఎమ్మెల్యే పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి పేరును ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఖ‌రారు చేశారు. స్పీక‌ర్ ఎన్నిక‌కు మిగిలిన పార్టీల‌తో పాటు కాంగ్రెస్ కూడా మద్ద‌తు తెల‌ప‌టంతో పోచారం ఎన్నిక ఏక‌గ్రీవం కానుంది.  ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో భేటీ అయిన పోచారం.. స్పీక‌ర్ ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ప‌లు కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. సీనియ‌ర్ ఎమ్మెల్యేగా మంచి అనుభ‌వంతో పాటు.. చ‌క్క‌టి ఇంగ్లిషు మాట్లాడ‌తార‌న్న పేరుంది. దీంతో.. స‌భా నిర్వ‌హ‌ణ ఆయ‌న‌కు ఏ మాత్రం క‌ష్టం కాద‌న్న భావ‌న ఉంది.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో టీడీపీ నేత‌గా ఉన్న పోచారం.. పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్ప‌టి నుంచి కేసీఆర్ కు స‌న్నిహితంగా ఉన్న ఆయ‌నకు తొలి అసెంబ్లీలో మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. తాజాగా.. స్పీక‌ర్ గా ఆయ‌న్ను కేసీఆర్ ఎంపిక చేశారు. త‌న‌కు అత్యంత ద‌గ్గ‌రైన పోచారం.. టీడీపీ నాటి నుంచి ఉన్న స‌న్నిహితంతోనే ఆయ‌న్ను స్పీక‌ర్ గా  సెలెక్ట్ చేశార‌న్న మాట వినిపిస్తోంది.


Full View

Tags:    

Similar News