అందరూ అన్ని పనులు చేయలేరు. అలానే కొందరు తమకు కొరుకుడుపడని కొన్ని విషయాల్ని వదిలేస్తుంటారు. కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి వ్యక్తి కాదు. తనకు కొరుకుడుపడని వాటి మీద కాస్త కాన్సంట్రేషన్ చేసి మరీ.. వాటి సంగతేందో తేల్చే రకం. ఆయనలో ఉన్న అలాంటి తత్వమే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మీద గులాబీ జెండా ఎగిరేలా చేసింది. హైదరాబాద్ లో తమ సత్తా చాటాలన్న తన కోరికను తాజా ఎన్నికలతో తీర్చుకున్న కేసీఆర్.. ఇప్పుడు తన బలాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల తర్వాత ఇప్పుడాయన వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్లపై ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్దగా పాత్రపోషించని ఖమ్మం జిల్లాపై ఇప్పుడాయన దృష్టి సారించారు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాలని డిసైడ్ అయిన ఆయన.. తాజాగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మంతో పాటు పలు కార్పొరేషన్లకు ఏటా రూ.100 కోట్లు ఇస్తామని.. వరంగల్ కార్పొరేషన్ కు మాత్రం రూ.300 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేమని అడుగుతారన్న ఉద్దేశంతో ఆయనే ముందుగా స్పందించి.. వరంగల్ పెద్ద కార్పొరేషన్ గా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను కట్టని వారికి వేసే జరిమానాను తాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తన ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం పట్టణంలో పర్యటించిన కేసీఆర్.. ఖమ్మం పట్టణం ఉండాల్సిన విధంగా లేదని.. పూర్తిగా మార్చేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పటమే కాదు.. ఖమ్మం పట్టణానికి మూడు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. రోడ్లు.. పార్కులు.. డ్రైనేజీలు.. తాగు నీటి వసతి.. చెరువుల అభివృద్ధి ఇలా.. చాలానే వరాలు అప్పటికప్పుడు ఇన్ స్టెంట్ గా ప్రకటించేశారు.
కేసీఆర్ మాటల్ని మొత్తంగా చూస్తే.. ఎవరికైనా సరే.. ఖమ్మం పట్టణం మీద కేసీఆర్ కు ఇంత అవగాహన ఉందా? అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది. ఇంత పట్టు ఎలా సాధ్యమంటే.. అదే కేసీఆర్ ప్రత్యేకతగా చెప్పాలి. తనకు కొరుకుడుపడని అంశాలపై పట్టు సాధించేందుకు ఇష్టపడే కేసీఆర్.. త్వరలో జరిగే ఖమ్మం కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగిరేలా చేయాలన్న లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో.. ఆ మాత్రం అవగాహన తప్పనిసరి. ‘‘ఖమ్మం’’ మీద కేసీఆర్ ఫోకస్ ఎందుకన్నది ఇప్పుడు అర్థమైందా..?