తెలంగాణ ఎన్నికలు ప్రధానంగా టీఆర్ ఎస్ - మహా కూటమి మధ్యే నడుస్తున్నాయి. మహా కూటమి అనేకంటే కాంగ్రెస్ అనడం బెటర్. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా.. గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అటు టీఆర్ ఎస్ కూడా పార్టీని గెలిపించుకోవడానికి తోడు... కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ ఐదుగురిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
కాంగ్రెస్ లో ప్రధాన నేతలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి - పద్మావతి - రేవంత్ రెడ్డి - డీకే అరుణ - జానారెడ్డి చలామణి అవుతున్నారు. సీనియర్ లీడర్ లైన వీరు ముఖ్యంగా టీఆర్ ఎస్ ఓటమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఆ ఐదుగురు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ప్రధాన దృష్టి పెట్టారు.
కేటీఆర్ - హరీష్ రావు తో కలిసి కేసీఆర్ వ్యూహ రచన చేసి కాంగ్రెస్ పార్టీలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి - పద్మావతి - రేవంత్ రెడ్డి - డీకే అరుణ - జానారెడ్డి ఓటమిపై మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. వీరు పోటీ చేస్తున్న హుజూర్ నగర్ - కొడంగల్ - గద్వాల్ - నాగార్జున సాగర్ - కోదాడ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
వారంలో మూడు రోజులు ఎవరో ఒకరు ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు సాగించేలా ప్రణాళిక వేసుకున్నారు. కొడంగల్ లో కేసీఆర్ బహిరంగ సభను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. కేటీఆర్ ఒకసారి కోదాడలో పర్యటించారు. మరోసారి పర్యటనకు రెడీ అవుతున్నారు. హరీష్ రావు హుజూర్ నగర్ - నాగార్జున సాగర్ కు వెళ్లి వచ్చారు. కాంగ్రెస్ లోని ప్రధాన నేతలే ఓటమే లక్ష్యంగా కేసీఆర్ కదుపుతున్న పావులు ఎంతవరకు ఫలితం ఇస్తాయో చూడాల్సిందే.