కారు వేగం పెంచుతోంది. కారు దూసుకెళ్లాలనుకుంటోంది. కారు గేరు మార్చాలనుకుంటుంది. కారు ప్రగతి నివేదన సభ వైపు పరుగులు తీస్తోంది. అవును... తెలంగాణ రాష్ట్ర సమితిలో అగ్రనాయకులే కాదు... దిగువ స్థాయి కార్యకర్తలు కూడా ఎన్నికల సమరాంగణానికి సమాయత్తమవుతున్నారు. న్యూఢిల్లీలో ముఖ్యంమంత్రి కె.చంద్రశేఖర రావు దౌత్యం ఫలించడం... ముందస్తు ఖాయం అన్న సంకేతాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎన్నికల జోరు పెరిగింది. తెలంగాణ అంతా ఇప్పుడు ముందస్తుకు ముందు జరిగే ప్రగతి నివేదన సభపైనే చర్చ జరుగనుంది. సెప్టెంబర్ రెండో తేదీన హైదరాబాద్ శివారు - రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభలో ముందుగా 15 మంది అభ్యర్ధుల పేర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో పార్టీ నుంచి పోటీ లేని, ఎలాంటి వివాదాలు లేని 15 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించాలన్నది కె.చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి మొత్తం అభ్యర్ధులందరినీ ప్రకటిస్తామని ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు.
దీనికి అనుగుణంగా ప్రగతి నివేదన సభలో ముందుగా 15 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటించాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించే తొలి జాబితాలో మంత్రులు కాని - ముఖ్య నాయకులు కాని ఉండరని అంటున్నారు. వారి పేర్లను ప్రకటిస్తే వీరికి టిక్కెట్లు ఖాయమే కదా....కొత్తగా ప్రకటించడం ఏమిటీ అనే విమర్శలు వస్తాయని భావిస్తున్నారు. ఇందుకు విరుగుడుగా తెలంగాణలో అంత ప్రాధన్యం లేని వారి పేర్లను ప్రకటిస్తారని అంటున్నారు. అలాగే సిట్టింగుల్లో ముగ్గురు లేదా నలుగుర్ని మార్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఈ సభలోనే ఆ ముగ్గురు లేదా నలుగురి స్ధానాల్లో ఎవరిని పోటీకి దించుతారో కూడా ప్రకటింవే అవకాశం ఉంది అంటున్నారు. దీని వల్ల ముందు నుంచే వారిని బుజ్జగించడం సాధ్యమమవుతుందని, ఆ పనిని మంత్రులు తారక రామారావు, హరీష్ రావు, ఈటెల వంటి వారికి అప్పగిస్తారని సమాచారం. దశల వారీగా అభ్యర్ధుల ప్రకటనను చేపట్టి ఎవరిలోనూ అసంత్రప్తి, ఆవేదన కలుగకుండా చేయాలన్నదే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు.