టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరావు తన పార్టీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల విషయంలో తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు ఈ సామాజిక వర్గానికి చెందిన ఖమ్మం నేతలకు ఓ రేంజిలో ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్... ఇప్పుడు వారిని అస్సలు దగ్గరకే రానివ్వడం లేదట. అయితే రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఈ సామాజిక వర్గాన్ని కేసీఆర్ దూరం చేసుకోలేరు కదా. అందుకే... కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల విషయంలో కేసీఆర్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారన్న వాదన వినిపిస్తోంది. త్వరలో తన మంత్రివర్గంలోకి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు చోటిచ్చేందుకు దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్... గతంలో తాను అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గ నేతలను కాదని అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు అవకాశం ఇవ్వనున్నారట. కేసీఆర్ వ్యూహంలో వచ్చిన ఈ మార్పుపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత తొలి సర్కారును ఏర్పాటు చేసిన కేసీఆర్... టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావును నేరుగా తన కేబినెట్ లోకి తీసుకుని ఆ తర్వాత ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత కూడా తుమ్మలకు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమే ఇచ్చారు. అయితే గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన ఓటమిపాలయ్యారు. అయినా కూడా తుమ్మలకు మరోమారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి తన కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ భావించినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఖమ్మం జిల్లాలోని ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు తలోదారిలో వెళుతూ పార్టీకి తీరని నష్టం చేస్తున్నారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించారట.
ఈ జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గ నేతల మధ్య కొనసాగుతున్న కుమ్ములాటల కారణంగానే ఖమ్మం జిల్లాలో టీఆర్ ఎస్ కేవలం సింగిల్ సీటుకు పరిమితమైందన్న విషయాన్ని కూడా కేసీఆర్ పసిగట్టారట. పార్టీకి నష్టం జరుగుతున్న వైనాన్ని గ్రహించి కూడా పట్టించుకోకుండా తన పాత వైఖరినే కొనసాగించేందుకు మొగ్గుచూపిన తుమ్మలను పక్కనపెట్టేసిన కేసీఆర్... ఖమ్మం నుంచి విజయం సాధించిన పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ కుమ్ములాటల్లో తుమ్మలతో పాటు పువ్వాడ కూడా తక్కువేమీ కాదని భావించిన కేసీఆర్ ఆయనను కూడా పక్కన పెట్టారట. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే జిల్లా ఇదే సామాజిక వర్గం నుంచి టీఆర్ ఎస్ లో చేరి ఖమ్మం నుంచి ఎంపీగా విజయం సాధించిన నామా నాగేశ్వరరావు కూడా వీరికేమీ తీసిపోరని కూడా కేసీఆర్ గ్రహించారట. ఈ క్రమంలో మొత్తంగా ఖమ్మం జిల్లా కమ్మ సామాజిక వర్గాన్ని దూరంగా పెట్టేసిన కేసీఆర్.... ఇదే సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన మరో నలుగురు కమ్మ నేతల వైపు దృష్టి సారించారని వినికిడి.
వీరిలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ - శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ - నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర రావు - ఆదిలాబాద్ జిల్లా సిర్ పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పల వైపు దృష్టి సారించిన కేసీఆర్... జిల్లా సమీకరణాల నేపథ్యంలో కోనప్ప - భాస్కరరావులను లిస్టు నుంచి తప్పించేశారట. ఇక మిగిలిన ఇద్దరు గోపీనాథ్ - గాంధీల ప్రొఫైల్స్ ను పరిశీలించిన కేసీఆర్... గోపీనాథ్ ను కూడా పక్కనపెట్టేసి గాంధీకి మంత్రి పదవి ఖరారు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గాంధీనే ఎందుకంటే.... కమ్మ సామాజిక వర్గానికి చెందిన సభలు - సమావేశాల విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటున్న గాంధీ... ఆ సామాజిక వర్గంలో బలమైన - దాదాపుగా అందరితో పరిచయాలున్న నేతగా కేసీఆర్ కు కనిపించారట. మొత్తంగా గ్రూపు తగాదాలతో ఖమ్మం కమ్మ నేతలు కేసీఆర్ కు దూరం కాగా... ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారితో మంచి సంబంధాలు నెరపుతున్న గాంధీ.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారన్న మాట.