డి.ఎస్ కు కేసీఆర్ పెద్ద పదవే ఇచ్చేలా ఉన్నాడు!

Update: 2015-07-15 06:04 GMT
డి. శ్రీనివాస్ పార్టీ మారిన తీరును చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆయనేం ఖర్మ.. కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయి నేతగా పేరు పొంది. ఒక దశలో వైఎస్ కు సమానుడు అన్న ఇమేజ్ ను పొంది.. ఇలా పార్టీ అధికారంలోకి లేకపోయే సరికి టీఆర్ఎస్ లోకి చేరుతూ.. ఆయన తన స్థాయిని ఎక్కడికి దిగజార్చుకొంటున్నాడు? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు కొంతమంది. ప్రదేశ్ కాంగ్రెస్ కు మాజీ అధ్యక్షుడు అయిన ఆయన ఇలా పార్టీ మారి ఆ పార్టీలో ఒక ద్వితీయ శ్రేణి నేతగా నిలవడం ఎందుకు? ఇది ఆయనకు తక్కువతనం అనిపించడం లేదా? అని మరికొంతమంది వ్యాఖ్యానించారు.

మరి రాజకీయాలకు బయట ఉండే వారి అభిప్రాయాలు అవి. అయితే రాజకీయాల్లో ఉన్నవారి లెక్కలు మాత్రం మరో రకంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి.. పార్టీ మారినందుకు డి.శ్రీనివాస్ అందుకు తగ్గ ప్రతిఫలం పొందబోతున్నాడు. తెరాసలో ద్వితీయ శ్రేణి నేత అవుతాడు అనుకొన్న ఆయనకు అతి త్వరలో మంత్రి హోదా లభించబోతోందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో డి. శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కడం ఖాయమైంది. ఎమ్మెల్సీ పదవిని ఇస్తూ.. శ్రీనివాస్ ను అంతకన్నా ముందే మంత్రిగా చేయనున్నాడట కేసీఆర్.

డి.శ్రీనివాస్ ను క్యాబినెట్ లోకి తీసుకోవడానికి అనుగుణంగానే పునర్వ్యస్థీకరణను ప్లాన్ చేస్తున్నాడల తెరాస అధినేత. అనేక రకాలుగా క్యాబినెట్ ను బ్యాలెన్స్ చేస్తూనే ఇదే సమయంలో శ్రీనివాస్ కోసం ఒక పదవిని అట్టి పెడుతున్నాడట. కాంగ్రెస్ పార్టీని వీడి తమ పార్టీలోకి వచ్చిన ఆయనను ఈ విధంగా సత్కరించనున్నాడట తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే.. ఒక మాజీ ఎమ్మెల్సీగా మిగిలిపోయేవాడు. ఇప్పుడు పార్టీ మారడంతో.. రోజుల వ్యవధిలోనే మంత్రి అయిపోతున్నాడు ఈ మాజీ కాంగ్రెస్ నేత. అదీ ఫిరాయింపులో ఉన్న పవర్!
Tags:    

Similar News