తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దసరా పండుగకు రాష్ట్ర శాసనసభ - శాసన మండలి సభ్యులకు ఎప్పట్నుంచో ఊరిస్తున్న గిఫ్ట్ అందించనున్నారట. హైదరాబాద్ లోని హైదర్ గూడలోని ఎమ్మెల్యేల పాతక్వార్టర్స్ ఆవరణలో రూ. 166 కోట్ల ఖర్చు తో ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల కోసం ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ఈ ఏడాది దసరా నాటికి ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు అందించాలని కేసీఆర్ డెడ్ లైన్ విధించారు.
తెలంగాణలో ప్రస్తుతం శాసనసభలో 120 మంది, మండలిలో 40 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 160 మంది సిట్టింగ్ సభ్యులతో పాటు కొందరు మాజీలు కూడా ఉన్నారు. కాగా, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఇప్పటికే మల్టీ స్టోర్ బిల్డింగ్స్ (ఎంఎస్) 1,2 పేరిట పాత క్వార్టర్ల ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో కొందరు సభ్యులు ఉంటున్నారు. తాజాగా ఎంఎస్-3 పేరుతో 120 ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మిస్తోందిది. నాలుగు బ్లాక్ లుగా - ఒక్కొక్క బ్లాక్ లో 12 అంతస్తులు ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క సభ్యుడి వద్ద పనిచేసే ఉద్యోగ సిబ్బంది - సర్వెంట్లు - సెక్యూరిటీ కోసం కూడా 120 చొప్పున అదే ప్రాంగణంలో ప్రత్యేకంగా క్వార్టర్లు నిర్మిస్తున్నారు. పార్కింగ్ స్థలాలు - రెండు షాపింగ్ కాంప్లెక్స్‌లు - జిమ్ - స్విమ్మింగ్ పూల్ - ఇండోర్ గేమ్ వంటి సౌకర్యాలను కూడా ఈ ఆవరణలో నెలకొల్పుతున్నారు. భారీ ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫ్లాట్ల కాంప్లెక్స్ నిర్మాణ బాధ్యతలను రోడ్లు భవనాల శాఖకు అప్పగించింది. రెండేండ్ల క్రితమే వీటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సముదాయాన్ని 2016 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే వివిధ కారణాలరీత్యా పనుల్లో కొంత జాప్యం కావడంతో అనుకున్న సమయానికి ఈ ఫ్లాట్లను వినియోగంలోకి తీసుకురాలేకపోయారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు - భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును సీఎం ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేసి ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటిదాకా 90 శాతం పనులు పూర్తికావచ్చాయని, మిగతా పనులు పూర్తిచేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ఈ దసరాకు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలకు కొత్త ఫ్లాట్లు వచ్చేస్తాయని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/