కేసీఆర్ దీ ఓటాన్ అకౌంటే - కానీ ఆర్నెళ్ల‌కు!

Update: 2019-02-02 07:22 GMT
దేశ‌మంతా ఆస‌క్తి రేకెత్తించిన కేంద్ర‌ బ‌డ్జెట్ ప్ర‌క్రియ ఎట్ట‌కేల‌కు ముగిసింది. లోక్ స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌వేళ పూర్తిస్థాయి బ‌డ్జెట్ ను ప్ర‌వేశపెట్టి ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపిస్తుందా? లేక తూతూమంత్రంగా తాత్కాలిక ప‌ద్దును తీసుకొస్తుందా? అంటూ సాగిన ర‌క‌ర‌కాల ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. తాత్కాలిక బ‌డ్జెట్ నే ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టికీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా కేంద్రం అందులో అనేక తాయిలాలు ప్ర‌క‌టించింది.

కేంద్ర బ‌డ్జెట్ తంతు ముగిసిన నేప‌థ్యంలో తెలంగాణ‌లో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఎలాంటి ప‌ద్దును ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంద‌నే అంశంపై ఇప్పుడు అంద‌రూ చ‌ర్చ ప్రారంభించారు. వాస్త‌వానికి బ‌డ్జెట్ విషయంపై సీఎం కేసీఆర్ ఇంత‌కుముందే స్ప‌ష్ట‌త ఇచ్చారు. కేంద్రంలో పూర్తిస్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడితే తాము కూడా రాష్ట్రంలో పూర్తిస్థాయి ప‌ద్దు తీసుకొస్తామ‌ని చెప్పారు. కేంద్ర‌ప్ర‌భుత్వం ఓటాన్ అకౌంట్ ప‌ద్దు ప్ర‌వేశ‌పెడితే తామూ తాత్కాలిక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని.. ఫ‌లితంగా కేంద్ర కేటాయింపుల్లో గంద‌ర‌గోళాన్ని నివారించ‌వ‌చ్చున‌ని చెప్పారు.

కేంద్రం తాత్కాలిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో ఇప్పుడు కేసీఆర్ కూడా ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఈ ప‌ద్దును కేవ‌లం మూణ్నెళ్ల వ్య‌వ‌ధికి కాకుండా ఆర్నెళ్ల‌కు తీసుకురావాల‌ని ఆయ‌న యోచిస్తున్నార‌ట‌. కేంద్ర ప్ర‌భుత్వం మూణ్నెళ్ల వ్య‌వ‌ధికే ప‌ద్దు తీసుకొచ్చింది. అయితే - సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి బ‌డ్జెట్ పై పార్ల‌మెంటులో చ‌ర్చ ముగిసేనాటికి జూన్‌-జులై వ‌చ్చేస్తుంది. అప్ప‌టివ‌ర‌కు కేటాయింపులపై పెద్ద‌గా స్ప‌ష్ట‌త ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం మూణ్నెళ్ల వ్య‌వ‌ధికి కాకుండా ఆర్నెళ్ల కాలానికి ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈ నెల మూడో వారంలో జ‌రగ‌నున్నాయి. ఆర్థిక శాఖ ఇప్పుడు సీఎం కేసీఆర్ వ‌ద్దే ఉంది. దీంతో స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యేనాటికి మంత్రివ‌ర్గ విస్తర‌ణ చేప‌ట్టి ఆర్థిక మంత్రితో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిస్తారా? లేక కేసీఆరే స్వ‌యంగా బ‌డ్జెట్ ను ప్ర‌వేశపెడ‌తారా? అనేది కూడా ఇప్పుడు స‌స్పెన్స్ గా మారింది. ప్ర‌స్తుతానికైతే కేసీఆర్ స్వీయ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బ‌డ్జెట్ రూపుదిద్దుకుంటున్న‌ట్లు స‌మాచారం.


Tags:    

Similar News