పిలుపుల జోరు పెరిగింది. డిసెంబరు నాలుగో వారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తన వ్యక్తిగత హోదాలో నిర్వహిస్తున్న ఆయుత చంఢీయాగానికి సంబందించి ప్రముఖుల్ని పిలిచే కార్యక్రమాన్ని మరింత జోరుగా సాగిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరిగా ఆయన ఆహ్వానం అందిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసాలెను చండీయాగానికి రావాలంటూ ఆహ్వానం అందించారు.
శనివారం సాయంత్రం మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న కేసీఆర్.. యాగం పనులు ఎంతవరకూ వచ్చాయన్న విషయాన్ని పరిశీలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఆహ్వానించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ లోని బాబు ఇంటికి వెళతారని చెబుతున్నారు. దసరా రోజున నిర్వహించిన ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లటం.. ఆయన్ను నెత్తిన పెట్టుకొన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూసుకొని ఎంతో జాగ్రత్తగా పంపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ ముఖాముఖిన కలిసే సందర్భంగా ఇదే అవుతుంది. మరి.. ఏ సమయంలో బాబు ఇంటికి కేసీఆర్ వెళతారన్నది ఇంకా ఖారారు కాలేదు.