ఏది ఉత్తినే జరగదు. అందునా తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారి నోటి నుంచి మాట వచ్చిందంటే అందుకో లెక్క ఉంటుంది. ఎంతో ముందుచూపుతో ఆలోచించి మాట్లాడే కేసీఆర్ నోట తాజాగా వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు సంచలనంగా మారాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ శాసించే ప్రభుత్వం ఏర్పడే వీలుందన్న వ్యాఖ్య ఆయన నోటి నుంచి వచ్చింది. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్య రావటానికి కారణం.. బీజేపీ ప్రభ దేశ వ్యాప్తంగా తగ్గిందన్న సంకేతాన్ని ఇవ్వటం ద్వారా.. హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి తమకు ప్రధాన ప్రత్యర్థిగా మారిన బీజేపీని ఆత్మరక్షణలో పడేసేందుకు కేసీఆర్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వచ్చాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇంతకూ కేసీఆర్ ఏమన్నారు? ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ప్రధాని మోడీతో తాను గొడవ పడిన సందర్భాన్ని ఎలా ప్రస్తావించారు? లాంటి అంశాల్ని ఆయన మాటల్లోనే వింటే..
- రాబోయే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ శాసించే ప్రభుత్వం ఏర్పడొచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
- కొన్ని సందర్భాలు కలిసొస్తయ్. రాజకీయాల్లో చాలా చూసినం. యూపీఏ ప్రభుత్వ సమయంలో మేము
ఐదుగురమే ఎంపీలం. కానీ మా అవసరం ఆనాడు అక్కడ ఉండె. రేప్పొద్దున కేంద్రంలో మనం శాసించే ప్రభుత్వం రావొచ్చు, మనకే కీలకమైన పాత్ర రావొచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే మనల్ని కనికరించొచ్చు
- మనకు రావాల్సిన వాటి గురించి కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా అడుగుతం. ప్రధానమంత్రిని ఎందుకు అడగం! సమస్యల పరిష్కారం కోసం ప్రధానికి ఏడు కాకపోతే బారెడు దరఖాస్తులు ఇస్తం. దళితబంధు కేంద్రం ఇస్తామంటే మేం వద్దంటమా? రెండు చేతుల దండం పెడుతం.
- కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఇప్పటికే అడిగిన. ఒకవేళ కేంద్రం సహకరిస్తే ఇది ఇంకా స్పీడ్ కావొచ్చు. రేపు జరిగే జనరల్ ఎలక్షన్స్ తర్వాత మనకు రాజకీయంగా కలిసొస్తే ఒకటే ఏడాది 5 లక్షల మంది దళితబంధు తీసుకోవచ్చు. వీలైనంత వేగంగా ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలని ఆలోచిస్తున్నా.
- గతంలో మన పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలను ఇతరులు గద్దల్లా తన్నుకుపోయారు. గతిలేని పరిస్థితుల్లో మనమంతా చూస్తూ ఉండిపోయినం. రాష్ట్రం కోసం పోరాడినం కాబట్టి లోటుపాట్లు మాకు తెలుసు. కొత్త జోన్లను క్యాబినెట్ ఆమోదించి పంపించిన తర్వాత దాన్ని ఆమోదించేందుకు కేంద్రం ఏడు నెలల సమయం తీసుకున్నది. ఈ జోనల్ విధానం ప్రకారం 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కేలా చేసినం. ఈ విధానాన్ని కేంద్రంతో ఒప్పించేందుకు నేను మూడు చెరువుల నీళ్లు తాగిన.
- ఢిల్లీకి పది చెక్కర్లు కొట్టిన. చివరికి ప్రధానిని కలిసి పెద్ద గొడవ చేసి.. సార్ మాకు ఈ సమస్య ఉన్నదని చెప్పిన. ప్రధానమంత్రి.. ‘ఏమయ్యా మీదేమైనా వేరే దేశమా? 95% రిజర్వ్ పెడతరా?’ అన్నరు. ‘సార్ మా బాధను అర్థం చేసుకోండి. ఇంతకు ముందు మమ్మల్ని ఎవరైతే ఎక్స్‌ప్లాయిట్ చేశారో, మా పక్క రాష్ట్రం వాళ్లు కూడా మేం మాట్లాడే భాషనే మాట్లాడుతరు. ఓపెన్ కోటా పెడితే మా పిల్లలకు వాళ్లు కూడా పోటీ వస్తరు’ అని చెప్పిన. ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకోవాలని కోరితే ప్రధానమంత్రి ఒప్పుకొన్నరు.
- దీంతో ఈ రోజు 95% రిజర్వేషన్లు తెలంగాణ బిడ్డలకు దక్కినయ్. ఇదీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత. బీసీ కులగణన చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. కేంద్రం కులగణనకు నిరాకరిస్తున్నది. సుప్రీంకోర్టులో మేం చేయలేమని అఫిడవిట్ వేసింది. తప్పకుండా బీసీల కులగణన జరగాలి. మనం
- దళితుల జనాభా ఒక్కో జిల్లాలో ఒక రకంగా ఉన్నది. లెక్కలు తెలియకుండానే మాట్లాడుతుంటారు. ప్రభుత్వ సర్వే ప్రకారం రాష్ట్రంలో కోటి 3 లక్షల కుటుంబాలుంటే అందులో దాదాపు 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి.