ఏపీలో కేసీఆర్ ఉండేది గంటేనా?

Update: 2015-12-13 09:39 GMT
చంద్రుళ్లు ఇద్దరూ మరోసారి కలవనున్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత హోదాలో నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బెజవాడకు వెళుతున్నారు. సోమవారం ఏపీ రాజధానికి వెళుతున్న ఆయన.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా ఆహ్వానం అందించనున్నారు. ఇందుకోసం కేసీఆర్ కార్యక్రమం శనివారం సాయంత్రం కన్ఫర్మ్ అయ్యింది.

ఇక.. కేసీఆర్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. సోమవారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బెజవాడకు వెళ్లనున్నారు. అక్కడ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. చండీయగానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాను చెల్లిస్తానన్న మొక్కుల్ని బెజవాడ కనకదుర్గమ్మకు చెల్లిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్ కు వచ్చేస్తారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ షెడ్యూల్ చూస్తే.. ఆయన ఏపీలో గడిపేది మహా అయితే.. గంట మాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బెజవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే సమయం కంటే.. రానుపోను ప్రయాణానికే కాస్త ఎక్కువ సమయం పడుతుందేమో.
Tags:    

Similar News