ఒకేచోట అన్నేసి భారీ నిర్మాణాల కేసీఆర్‌?

Update: 2016-02-23 11:30 GMT
ఏదైనా ఒక విష‌యం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టి కాని ప‌డితే.. దాని సంగ‌తి చూసేంత‌వ‌ర‌కూ నిద్ర‌పోర‌న్న పేరుంది. ఇలాంటి వైఖ‌రి వ‌ల్ల కొన్నిసార్లు మంచి ఎలా జ‌రుగుతుందో.. చెడు కూడా అదే జ‌రుగుతుంది. అంత‌కంత‌కూ శ‌క్తివంత‌మైన ముఖ్య‌మంత్రిగా మారిన కేసీఆర్‌ లాంటి నేత తీసుకునే నిర్ణ‌యాన్ని వేలెత్తి చూపించే సాహ‌సం పార్టీ నేత‌లే కాదు.. సీనియ‌ర్ అధికారులు కూడా చేయ‌రు. ఇక‌.. మీడియా సైతం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. ఘాటైన విమ‌ర్శలు చేసే అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది.

తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం చూసిన‌ప్పుడు దాని వ‌ల్ల క‌లిగే న‌ష్టం గురించి ఆయ‌న‌కు వివ‌రంగా చెప్పే వారెవ‌రూ అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఇందిరాపార్క్ స‌మీపంలోని ఎన్టీఆర్ గ్రౌండ్‌ లో క‌ళాభార‌తి నిర్మించాల‌ని అప్ప‌ట్లో కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. తాను నిర్మించే క‌ళాభార‌తి ఎలా ఉంటుంద‌న్న స్కెచ్ ను కూడా విడుద‌ల చేశారు.

ఇదిలా ఉంటే.. ఇక్క‌డే మ‌రో భారీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ నిర్మించాల‌న్న ఆలోచ‌న‌ను తాజాగా వెల్ల‌డించారు. మాదాపూర్‌ లోని హెచ్ ఐసీసీ మాదిరి ఈ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ భారీగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక్క‌డ స‌మ‌స్య ఏమిటంటే.. క‌ళాభార‌తి నిర్మాణంతోనే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే ఇందిరా పార్క్ ద‌గ్గ‌ర నిర్వ‌హించే స‌భ‌లు.. స‌మావేశాల కార‌ణంగానే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. దీనికి తోడుగా క‌ళాభార‌తి రానుంది. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా ఇప్పుడు భారీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వ‌స్తే ట్రాఫిక్ చిక్కులు మ‌రింత‌గా పెరిగిపోవ‌ట‌మే కాదు.. మౌలిక‌స‌దుపాయాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒకేచోట భారీ నిర్మాణాల‌న్నీ ఏర్పాటు చేసే క‌న్నా.. న‌గ‌రం న‌లుమూలలా విస్త‌రిస్తే బాగుంటుంది.
Tags:    

Similar News