తెలుగు వ్యక్తి దేశంలోనే అత్యున్నతమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియామకమైన సందర్భంలో జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఆయనకు విషెస్ తెలిపారు.
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఈరోజు జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రమణకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనకు ఓ సందేశాన్ని పంపారు.
'మన తెలుగుతేజం ఎన్వీ రమణగారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభసందర్భంగా వారికి శుభాభినందనలు' అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మీ విశేష అనుభవం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దేశానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మీ పదవీకాలం గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.