తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తాజాగా గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ను కలవడం వెనుక ఆసక్తికరమైన చర్చలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఈ భేటీ వెనుక మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు చేయడమే కారణమని చెప్తున్నారు. ? మంత్రి వర్గంలో భారీఎత్తున మార్పులు చోటు చేసుకోనున్నాయని, ఈ దఫా విస్తరణలో మహిళలు - ఇతర వర్గాలకు చోటు దక్కనుందని చెప్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్ - గవర్నర్ నరసింహన్ తో పనిలో పనిగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై మంతనాలు జరిపినట్టు సమాచారం. దీపావళికి మంత్రివర్గ విస్తరణ జరపకపోయినా కార్తీక మాసంలో ఏదో ఒక శుభ దినాన ఇందుకు ముహూర్తం ఖరారు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గతంలో ఉన్న పది జిల్లాలకు తోడుగా రాష్ట్రంలో మరో 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అన్ని జిల్లాల్లో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసేవిధంగా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని - నాలుగు జిల్లాలున్న పాత జిల్లాల్లో కనీసం ముగ్గురన్నా మంత్రులు ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్టు ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పార్టీకి చెందిన ముఖ్యనేతలు - సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు ప్రముఖులతో మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్టు తెలిసింది. మంత్రివర్గం నుంచి ఎవరిని తప్పిస్తారు? కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారు? అనే విషయంలో స్పష్టత ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. వివిధ వర్గాల అభిప్రాయం ప్రకారం ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో ఒకరు లేదా ఇద్దరు మహిళలకు అవకాశం దక్కవచ్చని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాలన - మంత్రులు - ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల ఒక సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను బట్టి మంత్రివర్గంలో మార్పులు చేపట్టాలని ఆయన ప్రతిపాదించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు సీనియర్లకు నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టే అవకాశం కూడా లేకపోలేదు. మరికొంత మందికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను ఇచ్చి తద్వారా ఆయా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నది సీఎం ఆలోచనగా కనిపిస్తోంది. కొందరు మంత్రులను పార్టీ సేవలకు వినియోగించుకోవాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 18 మంది సభ్యులను పాత జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ - మెదక్ (సీఎం కేసీఆర్ తో సహా) - మహబూబ్ నగర్ - కరీంనగర్ నుంచి ఇద్దరు - నిజామాబాద్ - నల్లగొండ - రంగారెడ్డి - ఖమ్మం జిల్లాల నుంచి ఒకరు మాత్రమే మంత్రిమండలిలో సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాను విడదీసి ఈ జిల్లాలో కొత్తగా నిర్మల్ - మంచిర్యాల - ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో జోగు రామన్న - ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. తాజాగా మూడు కొత్త జిల్లాలు ఏర్పడడంతో ఈ ఇద్దరు మంత్రుల్లో ఒకరిని తప్పించి తూర్పున ఉన్న ఆసిఫాబాద్ లేదా మంచిర్యాల జిల్లాల నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. తెదేపాను వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీ చేసి జోగు రామన్న విజయం సాధించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీచేసి గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ తెరాసలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ మంత్రిపదవి అవకాశం కల్పించారు. ఈ ఇరువురిలో ఎవరికి ఉద్వాసన ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ఈ జిల్లాలో కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పడింది. నకిలీ విత్తనాలను అరికట్టడంలో పోచారం ఘోరంగా విఫలమయ్యారన్న విపక్ష పార్టీల ఆరోపణలను ధీటుగా ఎదుర్కోలేకపోయారని దీనికితోడు తనకు కేటాయించిన శాఖను ఆశించిన స్థాయిలో నిర్వహించలేక పోతున్నారన్న ప్రచారం జరుగుతుండడంతో విస్తరణలో పోచారంను తొలగించే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. ఒకవేళ పోచారంను తొలగిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన రవీందర్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవచ్చన్న ప్రచారం ఉంది. పోచారంతో పాటు జిల్లా నుంచి మరొకరికి అవకాశం రావచ్చని తెలుస్తోంది.
మెదక్ జిల్లాలో మార్పులు - చేర్పులు ఉండకపోవచ్చు. ఈ జిల్లా నుంచి మంత్రి హరీష్ రావు ఇప్పటికే మంత్రివర్గంలో ఉండగా, గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ సీఎంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి ఆర్తిక మంత్రి ఈటెల రాజేందర్ - ఐటీ - పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మంత్రివర్గంలో ఉన్నారు. పూర్వపు కరీంనగర్ జిల్లా విడిపోయి కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల - జగిత్యాల - పెద్దపల్లి జిల్లాలు కొత్తగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఇరువురు మంత్రులతోపాటు చీఫ్ విప్ గా ఉన్న కొప్పుల ఈశ్వర్ కు మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పూర్వపు కరీంనగర్ నాలుగు జిల్లాలుగా ఏర్పడడంతో మంత్రుల సంఖ్యను కూడా కనీసం మూడుకు పెంచాలన్న ఆలోచనతో సీఎం ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి - గిరిజన - పర్యాటక శాఖ మంత్రి అజ్మిరా చందూలాల్ మంత్రివర్గంలో ఉన్నారు. శ్రీహరిని శాసనమండలి చైర్మన్ గా ఎంపిక చేసి చందూలాల్ ను తొలగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లా నుంచి కొండా సురేఖకు అవకాశం కల్పించవచ్చన్న ప్రచారముంది. చందూలాల్ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన రెడ్యానాయక్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
వరంగల్ జిల్లాను విడదీసి జనగామ - వరంగల్ రూరల్ - మహబూబాబాద్ జిల్లాలుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అవకాశం వస్తే వినయ భాస్కర్ ను కూడా మంత్రివర్గంలో తీసుకోవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రివర్గంలో చేర్చుకుంటే ఎలా ఉంటుందన్న అంశంపై కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. తెదేపాను వీడి తెరాసలో చేరిన తలసానిని మంత్రివర్గంలో ఇప్పటికే తీసుకున్నారు. ఇలా చూస్తే ఎర్రబెల్లికి కూడా అవకాశం వచ్చి తీరుతుందన్న భరోసాతో ఆయన అనుచరగణం ఉంది.
ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మంత్రిపదవిని ఆశిస్తున్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగంను మంత్రిగా కాకుండా కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు చెబుతున్నారు. కొత్తగూడెం జిల్లాగా ఏర్పడడంతో ఈ జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని ఈ ప్రాంతానికి చెందిన నేతలు సీఎంను కలిసి అభ్యర్థించారు.
రంగారెడ్డి జిల్లా నుంచి రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మంత్రివర్గంలో ఉండగా, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం. కడియం శ్రీహరిని మండలి చైర్మన్ గా ఎంపిక చేస్తే స్వామిగౌడ్ కు అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డిని తాజాగా వికారాబాద్ - మల్కాజ్ గిరి జిల్లాలుగా ఏర్పాటు చేశారు. శంషాబాద్ నుంచి స్వామిగౌడ్ కు అవకాశం రావచ్చని చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు - లక్ష్మారెడ్డిలు మంత్రులుగా ఉన్నారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తెరాసలో చేరితే ఆమెకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చని జూపల్లికి ఉద్వాసన ఉంటుందని సమాచారం. ఈ జిల్లాలో కొత్తగా నాగర్ కర్నూల్ - జోగులాంబ గద్వాల - వనపర్తి జిల్లాలను ఏర్పాటు చేశారు. ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవిని ఇవ్వాలన్న ఆలోచనతో కూడా కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే - గెజిటెడ్ ఉద్యోగుల నేత శ్రీనివాస్ గౌడ్ కు కూడా మంత్రివర్గంలో చోటు దక్కవచ్చనే ప్రచారం ఉంది.నల్లగొండ జిల్లా నుంచి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఈ జిల్లాలో కొత్తగా యాదాద్రి భువనగిరి - సూర్యాపేట జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ జిల్లా నుంచి మరొకరికి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశముంది. నల్లగొండ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తాను తెరాసలో చేరితే మంత్రిపదవి ఇవ్వాలన్న షరతును విధించారని, ఒకవేళ ఆయనకు అవకాశం ఇవ్వాలని భావిస్తే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రిపదవి ఇవ్వచ్చని సమాచారం. ఎంపీగా ఎంపీగా రాజీనామా చేసి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని కూడా భావిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎమ్మెల్సీలుగా ఉన్న ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ - హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ - సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిద్దరికి మంత్రివర్గం నుంచి తొలగింపు ఉండే అవకాశాలు ఉన్నాయని, కొత్తగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై చర్చలు సాగుతున్నాయని తెరాస ముఖ్యనేత ఒకరు చెప్పారు. మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల సామాజిక వర్గాలను పరిశీలిస్తే వెలమ సామాజిక వర్గం నుంచి సీఎంతో సహా నలుగురు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆరుగురు, మైనారిటీ ఒకరు - ఎస్సీ ఒకరు - ఎస్టీ ఒకరు - కమ్మ ఒకరు, బీసీ సామాజిక వర్గం నుంచి నలుగురు ఉన్నారు. బీసీల్లో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరు, మున్నూరు కాపు ఒకరు - గౌడ ఒకరు - యాదవ్ ఒకరు - ఎస్సీ మాదిగ ఒకరు - ఎస్టీ ఒకరు ఉన్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఎస్సీ (మాల) - మహిళలు - బీసీల్లో ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయన భారీ కసరత్తును చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/