ఎవరీ బాల్ రెడ్డి అనుకుంటున్నారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కీర్తి తల్లి హత్య కేసులో కీలకమైన బాల్ రెడ్డి వ్యవహారం అనుకోని మలుపు తిరిగినట్లుగా కనిపిస్తోంది. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కీర్తి కేసులో ఆమె మొదటి ప్రియుడు బాల్ రెడ్డి అన్న విషయం తెలిసిందే. మైనర్ గా ఉన్న కీర్తితో అతడు వ్యవహరించిన తీరుతో పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయటం.. మీడియా సమావేశంలో అతడ్ని రిమాండ్ కు పంపుతున్నట్లుగా చూపించటం తెలిసిందే.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన శశికుమార్ ను చర్లపల్లి జైలుకు పంపిన అధికారులు.. బాల్ రెడ్డిని మాత్రం ఎక్కడకు పంపారు? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి నెలకొంది. ఈ ఉదంతంలో కీర్తిని చంచలగూడ మహిళా జైలుకు పంపితే.. శశికుమార్ ను చర్లపల్లి జైలుకు పంపారు. బాల్ రెడ్డిని కూడా చర్లపల్లి జైలుకే తరలించాల్సిన అవసరం ఉంది.
కానీ.. చర్లపల్లి జైలు అధికారులు మాత్రం తమ వద్దకు బాల్ రెడ్డి రాలేదంటున్నారు. కీర్తి తల్లి హత్య కేసులో నిందితులైన ముగ్గురిలో బాల్ రెడ్డి తప్పించి మిగిలిన ఇద్దరు (శశికుమార్.. కీర్తి) వేర్వేరు జైళ్లకు వెళ్లిన వైనంపై క్లారిటీ ఉన్నా.. బాల్ రెడ్డి ఎక్కడ? అన్న దానిపై ఇప్పుడు సస్పెన్స్ వ్యక్తమవుతోంది. బాల్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తీసుకొస్తారన్న సమాచారం లేదని చర్లపల్లి జైలు సిబ్బంది చెబుతున్నారు.
మరోవైపు పోలీసులు.. తాము బాల్ రెడ్డిని జైలుకు పంపినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో.. కొత్త కన్ఫ్యూజన్ తెర మీదకు వస్తోంది. ఫోక్సో కేసుతో పాటు ఐపీసీ సెక్షన్ 302 పెట్టిన తర్వాత.. కనీసం నెల రోజుల వరకూ బెయిల్ లభించే అవకాశం ఉండదని.. అలాంటప్పడు జైలుకు తరలించకుండా బాల్ రెడ్డిని ఎక్కడ ఉంచారన్నది ఇప్పుడు కొత్త ప్రశ్నగా మారిందంటున్నారు. జైలులో ఉండాల్సిన బాల్ రెడ్డి ఇప్పుడు చర్లపల్లిలోనూ.. అటు చంచల్ గూడ జైల్లోనూ లేని నేపథ్యంలో ఇప్పుడెక్కడ ఉన్నాడన్నది మిస్టరీగా మారిందని చెప్పకతప్పదు.