వారికి భార‌తర‌త్న ఇవ్వాలి.. మోడీకి కేజ్రీవాల్ లేఖ‌

Update: 2021-07-04 23:30 GMT
మ‌న దేశంలో కొవిడ్ మ‌హ‌మ్మారి ఎంత‌టి మార‌ణ‌హోమం సృష్టించిందో తెలిసిందే. ల‌క్ష‌లాది కేసులు, వేలాది మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఈ క్ర‌మంలో ఆసుప‌త్రుల‌న్నీ నిండిపోయాయి. అలాంటి బాధితులంద‌రినీ త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి కాపాడారు హెల్త్ వ‌ర్క‌ర్స్‌. డాక్ట‌ర్ల నుంచి న‌ర్సులు, కాంపౌండ‌ర్ల వ‌ర‌కు అంద‌రూ ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ప‌నిచేసి ఎంతో మంది ప్రాణాల‌ను నిల‌బెట్టారు.

అలాంటి వారంద‌రిని స‌ముచితంగా గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. ‘‘డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బంది మొత్తం త‌మ ప్రాణాల‌ను, కుటుంబాల‌ను ప‌ట్టించుకోకుండా.. రోజుల త‌ర‌బ‌డి ఆసుప‌త్రుల్లో ప‌నిచేశారు. వీరికి భార‌త ర‌త్న పుర‌స్కారం అందించాలి. ఈ పుర‌స్కారం పొంద‌డానికి వీరు అర్హులు. వీరికి ఈ గుర్తింపు ద‌క్కితే దేశం మొత్తం ఆనందిస్తుంది’’ అని లేఖలో పేర్కొన్నారు కేజ్రీ.

జాతీయ వైద్య దినోత్సవం వేళ.. ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ను ఉద్దేశించిన ప్ర‌సంగించిన మోడీ.. వైద్య సిబ్బంది సేవ‌ల‌ను కొనియాడారు. అభివృద్ధి చెందిన దేశాల‌క‌న్నా.. మ‌న దేశ వైద్ సిబ్బంది ల‌క్ష‌లాది కొవిడ్ రోగుల‌ను కాపాడార‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలోనే కేజ్రీవాల్ ఈ లేఖ రాశారు. ఇలాంటి వారంద‌రికీ భార‌త ర‌త్న పుర‌స్కారం ఇచ్చి గౌర‌వించాల‌ని కోరారు.
Tags:    

Similar News