ఒమిక్రాన్ వేళ.. ఢిల్లీలో లాక్ డౌన్ పై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

Update: 2021-12-08 03:58 GMT
వస్తుంది.. వచ్చేస్తోందంటూ.. థర్డ్ వేవ్ మీద అంచనాలకు భిన్నంగా ఏమీ జరగకపోవటంతో అందరూ ప్రశాతంగా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఊహకు అందని విధంగా సెకండ్ వేవ్ క్రియేట్ చేసిన విధ్వంసం.. విలయం.. విషాదాల నుంచి దేశం బయట పడుతూ.. చేదు అనుభవాల్ని మళ్లీ గుర్తు చేసుకోవాలని ఏ మాత్రం అనుకుంటున్నారు.

ఇలాంటివేళ.. అనూహ్యంగా ఒమిక్రాన్ రూపంలో తెర మీదకు రావటం తెలిసిందే. సౌతాఫ్రికాలో బయటకు వచ్చిన ఈ వేరియంట్ మీద అటు డబ్ల్యూహెచ్.. ఇటు ప్రపంచ దేశాలు సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి.

ఇలాంటివేళ.. దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు బయట పడ్డాయి. ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే.. మన దేశంలో ఇప్పటివరకు బయటపడిన కేసులు తక్కువే. అయినప్పటికీ దేశానికి ఒమిక్రాన్ ముప్పు ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి వేళ.. ఒమిక్రాన్ భయం ప్రజల్లో ఎంతన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. ప్రజలు మాత్రం కరోనా నిబంధనల్ని మాత్రం పట్టించుకోవటం లేదు. ఇలాంటివేళ.. కేసుల తీవ్రత పెరిగితే.. లాక్ డౌన్ తప్పదా? అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం అంతకంతకూ జోరందుకుంటోంది.

ఇలాంటివేళ.. ఈ ప్రచారంపై స్పందించారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు 1347 కేసులు బయటపడితే.. దేశంలో 24 కేసుల్ని మాత్రమే నిర్ధారించారు. మొత్తం కేసుల సంఖ్యతో చూసినప్పుడు.. మన వద్ద నమోదైన సంఖ్య చాలా తక్కువే. అలా అనుకుంటే ఈ వేరియంట్ కారణంగా దెబ్బ పడటం ఖాయమన్న అభిప్రాయం వైద్య వర్గాలు వార్నింగ్ ఇస్తున్నాయి.

‘ఒమిక్రాన్ ను ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలా అని లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాం. ఇలాంటి వేళ ప్రజలకు ఒక విన్నపాన్ని చేయాలని భావిస్తున్నాం. ప్రజలంతా మాస్కులు ధరించాలి. భౌతికదూరాన్ని పాటించాలి.

మాస్కే మనకు శ్రీరామరక్ష’ అని పేర్కొన్నారు. దీంతో.. ఢిల్లీలో లాక్ డౌన్ విధించే ఎలాంటి ఆలోచన లేదన్న విషయాన్ని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ మాత్రమే కాదు.. మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ ను ఏదోలా ఎదుర్కోవాలనే చూస్తుంది తప్పించి.. లాక్ డౌన్ విధించే దిశగా ఆలోచన చేయటానికి కూడా సాహసించదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News