కవిత మీద తీవ్ర విమర్శలు..అందుకే కండువా మారిందట!

Update: 2019-10-30 08:03 GMT
ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆయన కుమార్తె కమ్ మాజీ ఎంపీ కవిత కారణంగా తాను కండువాను మార్చుకోవాల్సి వచ్చిందన్న సంచలన వ్యాఖ్య చేశారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వల్లే తాను మరో యూనియన్ కండువా కప్పుకోవాల్సి వచ్చినట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకుడు కెంగర్ల మలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

కవితను తాను నమ్మి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయారని.. ఆయన తిరిగి ఆ స్ఫూర్తిని పొందటం ఎన్నటికి జరగదన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందే బొగ్గుగని కార్మిక సంఘాన్ని స్థాపించి.. నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. తనను అడుగడుగునా అవమానాలకు గురి చేశారన్నారు.

పైరవీకారులకు పగ్గాలు అందజేశారని.. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరినట్లు.. టీబీజేకేఎస్ లో చొరబడ్డ కొన్ని శక్తులు యూనియన్ ను చిన్నాభిన్నం చేశాయని మండిపడ్డారు. మొత్తానికి ఈ స్థాయిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఇంత ఘాటు వ్యాఖ్యలు ఇప్పటివరకూ వచ్చింది లేదు. మరి.. ఈ వ్యాఖ్యలపై కవిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News