తన మత విశ్వాసాలకు అప్పుడే పుట్టిన శిశువు ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఓ తండ్రి. ఐదు అజాన్లు వినేదాకా పాలివ్వొద్దని బాలింతకు భర్త హుకుం జారీచేశాడు. పోలీసులు - వైద్యులు చెప్పినా వినకుండా భార్య బిడ్డను తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో శిశువు ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ముస్లిం సంప్రదాయాన్ని బలంగా నమ్మిన ఆ తండ్రి తీరును పలువురు తప్పుపడుతున్నారు.
కేరళలోని కోజికోడ్ దవాఖానలో అబుబకర్ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. పుట్టిన రెండుగంటల్లోగా శిశువుకు పాలు పట్టించాలని - లేకుంటే ప్రాణాపాయమని వైద్యులు సూచించారు. తన బిడ్డ ఐదు అజాన్లు (ఇందుకు 24 గంటల సమయం పడుతుంది) వినేంత వరకు తొలిసారి పాలు ఇవ్వొద్దని - తన భార్యకు అబుబకర్ హుకుం జారీచేశాడు. ఆమె వైద్యులు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ భర్తకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఎంతకూ అబుబకర్ వినకపోవడంతో ఈ విషయాన్ని వైద్యులకు చెప్పింది. డాక్టర్ తోపాటు పోలీసులు అబుబకర్ కు నచ్చచెప్పారు. అయినా, అతడు వినకపోగా భార్య బిడ్డను తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ చిన్నారి ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/