రీల్ బాహుబలిని యావత్ భారతమే కాదు.. విదేశీయులు చూశారు. మెచ్చారు. వందల కోట్ల కలెక్షన్లను కానుకగా ఇచ్చారు. బాహుబలిలో కనిపించే పాత్రకు మించిన వ్యక్తిగా ఇప్పుడు కేరళ మంత్రిగా అభివర్ణిస్తున్నారు. ఆయన చేస్తున్న పని చూస్తే.. నిజమనిపించక మానదు. ఆయనకు చెందిన ఒక ఫోటో వైరల్ అవుతూ.. రియల్ బాహుబలి ముందు రీల్ బాహుబలి తేలిపోయినట్లుగా చెబుతున్నారు. ఎందుకిలా అంటే..
బాహుబలి సినిమాలో తల్లికి శ్రమ తగ్గించటం కోసం అంత పెద్ద శివలింగాన్ని బాహుబలి భుజానికి ఎత్తుకుంటాడు. వెండితెర మీద ఆ దృశ్యాన్ని చూసినోళ్లంతా వావ్ అనేస్తారు. ఆ వెనుకనే అదిరిపోయే సంగీతం ఆ సీన్లోకి మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. మరి.. రియల్ బాహుబలి మాటేమిటి? అంటారా.. అక్కడికే వస్తున్నాం.
ప్రకృతి విలయతాండవం ఆడేసిన వైనానికి కేరళ ఎంతలా అతలాకుతలమైందో తెలిసిందే. ఇలాంటి వేళ.. బాధిత ప్రజల కోసం కేరళ రాష్ట్ర మంత్రి ఒకరు శ్రామికుడిగా మారిపోవటమే కాదు.. మూటలు భుజాన ఎత్తుకొని పని చేస్తున్న వైనం ఇప్పుడు ఫోటో రూపంలో వైరల్ అవుతోంది.
వరద సాయం కోసం బాధితులకు సాయం అందించేందుకు వీలుగా ఒక పునరావాస శిబిరానికి ఒక వాహనం వచ్చింది. అప్పటివరకూ అక్కడ జరుగుతున్న సహాయక చర్యల్ని పరిశీలిస్తున్న కేరళ విద్యా మంత్రి రవీంద్రనాథ్.. తన అధికార దర్పాన్ని వదిలేసి.. ఒక చేయి వేశారు. లుంగిని పైకి కట్టేసిన ఆయన.. బ్లూ కలర్ బ్యాగ్ ను భుజానికి ఎత్తుకొని దూరాన ఉన్న సహాయక శిబిరం వద్దకు చేరవేశారు.
అక్కడే ఉన్న ఒక పాత్రికేయుడు ఈ దృశ్యాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ తరహా సహాయక చర్యలు కేవలం కేరళలో మాత్రమే చూస్తామని సదరు జర్నలిస్టు పేర్కొంటే.. ఈ వీడియో వైరల్ అయి.. ఆ మంత్రిని బాహుబలితో పోలుస్తూ మోమోలు వేస్తున్నారు నెటిజన్లు. నిజమే.. ఒక మంత్రి తన హోదాను.. దర్పాన్ని పక్కన పడేసి.. మూట మోయటం.. అది కూడా కెమేరాలకు ఫోజులివ్వటం కోసం కాకుండా.. సామాన్యుడిగా చేయటం అందరి మనసుల్ని టచ్ చేస్తుంది. ఆయనకు ఫిదా అయ్యేలా చేస్తోందని చెప్పక తప్పదు.