తమిళనాడులో నీట్ పరీక్షా కేంద్రాల గురించి కొద్దిరోజులుగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వివాదం సద్దుమణిగిందనుకుంటున్న నేపథ్యంలో ఆదివారం కేరళలో నిర్వహించిన నీట్ పరీక్షలో ఇన్విజిలేటర్ల తీరు పెను దుమారం రేపింది. ఆ పరీక్ష సందర్భంగా తాను వేధింపులకు గురయ్యానని 18 ఏళ్ల విద్యార్ధిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఇన్విజిలేటర్లు బ్రా తొలగిస్తేనే పరీక్షకు అనుమతిస్తామనిఆదేశించారని ఆమె పేర్కొంది. అంతేకాకుండా.... పరీక్షా హాల్ లో మగ ఇన్విజిలేటర్ తనవైపు అవమానకరరీతిలో చూశారని, దాంతో తాను తీవ్ర మనస్తాపానికి లోనయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఆ బ్రాకు స్టీల్ హుక్స్ ఉన్నాయని, సీబీఎస్ ఈ నిబంధనల ప్రకారం పరీక్ష హాల్లోకి మెటల్ వస్తువులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఆ ఇన్విజిలేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేరళలోని పలక్కాడ్ జిల్లాలోని ఓ నీట్ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినులకు తీవ్ర అవమానం జరిగింది. స్టీల్ హుక్స్ ఉన్న బ్రాలు ధరించిన విద్యార్థినులను...అవి తొలగిస్తేనే అనుమతిస్తామని ఇన్విజిలేటర్లు తెలిపారు. నిబంధనల ప్రకారమే అలా చేశామని చెప్పారు. అయితే, వాటిని తొలగించి పరీక్ష రాస్తున్న విద్యార్థినులవైపు ఇన్విజిలేటర్ అసభ్యకర రీతిలో చూశారని ఓ విద్యార్థిని ఆరోపించింది.దాదాపు 25 మంది విద్యార్ధినులను బ్రా తొలగించాలని సిబ్బంది ఆదేశించారని ఆమె బంధువు ఒకరు తెలిపారు. ఆ మగ ఇన్విజిలేటర్ పదే పదే విద్యార్థినులవైపు చూశాడని, దీంతో, వారు తమ ఛాతీకి ప్రశ్నాపత్రం అడ్డుపెట్టుకొని ఇబ్బందిపడుతూ పరీక్ష రాశారని ఆరోపించారు. అయితే, సీబీఎస్ఈ నిబంధనల ప్రకారమే సిబ్బంది నడుచుకున్నారని, కేసు నమోదు చేయలేమని పోలీసులు తెలిపారు. అయితే, అయితే ఆ విద్యార్థి పట్ట అనుచితంగా వ్యవహరించిన మగ ఇన్విజిలేటర్ పై ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఈ ఒక్క పరీక్షా కేంద్రంలోనే ఈ విధంగా జరిగిందని, మిగతా చోట్ల ఈ తరహా ఇబ్బందులు లేవని తన మిత్రులు చెప్పినట్టు బాధిత విద్యార్థిని తెలిపింది.