ఆయన నిజానికి విధేయత కలిగిన పార్టీ నాయకుడే అని చెప్పాలి. అలాగే మంచి వ్యాపార దక్షత కలిగిన కుటుంబానికి వారసుడు. ఆయనే విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఆయన చాలాకాలంగా టీడీపీ అధినాయకత్వంతో విభేదిస్తున్నారు. ఆయన తనను హై కమాండ్ తక్కువ చేస్తూ చూస్తోందని, అలాగే అనుమానిస్తోందని కూడా వగచి వాపోతున్నారు.
అయితే ఫైర్ బ్రాండ్ నేచర్ కలిగిన నాని ఏదీ మనసులో దాచుకోవడలేదు. తన తీరు ఇంతే అని అధినేతకు చెప్పేస్తున్నారు. అలాగే తన కోపతాపాలు కూడా ఆయన ఎదురుగా ప్రదర్శిస్తున్నారు. నిజంగా ఇది చంద్రబాబుకు వింత అనుభవం, కొత్త అనుభవం కూడా. ఇప్పటిదాకా ఎంతో మంది చంద్రబాబుని వీడి బయటకు వెళ్ళిపోయారు. వారు బయటకు వెళ్ళి అనేక రకాలుగా విమర్శలు చేశారు.
కానీ చంద్రబాబు ఎదురుంగా ముఖాముఖీగా ఆయనతో మాటలతో తలపడి విమర్శలు చేసిన వారిగా నాని ఉంటారెమో. ఆ మధ్య ఢిల్లీ ఎయిర్ పోర్టులో బాబుకు బొకే ఇవ్వను అంటూ నాని చేసిన హంగామా అంతా సోషల్ మీడియా ద్వారా వైరల్ అయినా వీడియో ద్వారా చూశారు. ఇపుడు లేటెస్ట్ గా చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ పరిస్థితిపై బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన కేశినేని నాని టీడీపీని ఒక కంపెనీగా పేర్కొంటూ బాబుకు షాకించారు. మీ కంపెనీ మీ ఇష్టం, మీ వారసుడి ఇష్టం అన్నట్లుగా మాట్లాడారని ప్రచారం సాగుతోంది. నా కంపెనీ నేను నా ఇష్టం వచ్చినట్లుగా నడుపుకుంటాను, అలాగే మీరు టీడీపీని నడుపుకోండి అంటూ నాని విమర్శించడంతో బాబు షాక్ తినడమే కాకుండా మండిపడ్డారని అంటున్నారు.
ఇది కంపెనీ కాదు, ప్రజల పార్టీ. తాను హరిక్రిష్ణ, లక్ష్మీపార్వతి ల నుంచి పోరాడి పార్టీని తన నాయకత్వం కిందకు తెచ్చుకున్నాని బాబు చెప్పుకొచ్చారు. దానికి పార్టీలోని అందరి సమ్మతి ఉందని ఆయన వివరించారని అంటున్నారు. ఇదిలా ఉండగా నాని చేసిన వ్యాఖ్య్ల పట్ల బాబు ఆవేదన చెందారని అంటున్నారు. మరో వైపు చూస్తే తాను పార్టీకి విధేయుడిగానే ఉంటున్నానని, తాము ఎటువంటి ఇబ్బందిపెట్టే చర్యలకు దిగలేదని నాని చెప్పారని అంటున్నారు.
అయినా సరే తన స్థానంలో వేరొకరిని ప్రోత్సహిస్తున్నారు అంటూ తన తమ్ముడు చిన్నిని ప్రోత్సహిస్తున్న పార్టీ వైఖరిని ఎత్తిచూపారని అంటున్నారు. పదే పదే నా విధేయతను చూపించుకోమడం భావ్యం కాదని నాని కటువుగానే అన్నట్లుగా చెబుతున్నారు. ఇక తనకు ఎన్నో ఆఫర్లు ఉన్నా తాను పార్టీ కోసం కట్టుబడి ఉన్నాను అని నాని గుర్తు చేశారని చెబుతున్నారు.
తనకు బీజేపీ పెద్దల నుంచి ఆఫర్ వచ్చినా పార్టీ మారలేదు కదా అని పేర్కొన్నారని అంటున్నారు. బాబు సన్నిహితులు అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతికి గుర్తు చేసి వారి మాదిరిగా తాను పార్టీకి ద్రోహం చేయలేదు కదా అని వివరించారుట.
మరోవైపు బాబు ముందే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదు అన్నట్లుగా నాని ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టారని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు జిల్లా సమీక్ష కాదు కానీ నాని బాగానే బయటపడిపోయారని, బాబుకు ఎన్నడూ చూడని అనుభవాలను కూడా కలిగించారని అంటున్నారు.
ఆయన తనను పార్టీ సైడ్ చేస్తోంది అన్న భావనతో ఉన్నారని అంటున్నారు. మరి టీడీపీకి గుడ్ బై అన్నట్లుగా దాదాపుగా బాబు ముఖం మీదనే చెప్పేసిన నాని రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.