తన వ్యాఖ్యలు - సెటైర్లతో చంద్రబాబుకు చుక్కలు చూపించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ తరువాత కాస్త మెత్తబడినా మళ్లీ ఇప్పుడు కృష్ణా జిల్లా టీడీపీలో ముసలం పుట్టిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు విజయవాడ టీడీపీలో అగ్గి రాజేశాయి. దీంతో చంద్రబాబు వద్దకు నానిపై ఫిర్యాదులు వెళ్లాయట.
టీడీపీ మాజీ కార్పొరేటర్లతో కేశినేని నాని శనివారం తన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వారితో ‘వచ్చే ఎన్నికల్లో నాగుల్ మీరాను ఎమ్మెల్యేగా చూడాలి’ అనడం... వారిలో కొందరు ఆ మాటలను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నేతలు బుద్ధా వెంకన్న - జలీల్ ఖాన్‌లకు చేరవేయడంతో మంట రాజుకుంది.
నాగుల్ మీరా మొన్నటి ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తెకు అక్కడ టికెట్ ఇవ్వగా ఓటమి పాలైంది. అలాగే.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నదీ అదే నియోజకవర్గం. ఆయన కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యే కావాలని చాలాకాలంగా ఆశపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో నాని వ్యాఖ్యలు వారిలో అసహనం కలిగించాయట.
మైనార్టీలకు అనుకూలమైన నియోజకవర్గం విజయవాడ పశ్చిమం. 1999లో నాగుల్ మీరా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జలీల్ ఖాన్ చేతిలో సుమారు 3,100 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. నియోజకవర్గం ఆవిర్భవించాక ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు మైనార్టీలు గెలుపొందారు. దీంతో నాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన నేరుగా.. పశ్చిమ నియోజకవర్గం నుంచే నాగుల్ మీరా పోటీ చేస్తారని చెప్పకపోయినా ఆ వ్యాఖ్యల సారాంశం అదేనని పశ్చిమ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతోకాలంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న బుద్దా వెంకన్న లాంటి నేతలను సంప్రదించకుండా ఎంపీ ఏకపక్షంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని వెంకన్న అనుచరులు ప్రశ్నిస్తున్నారు. జలీల్ ఖాన్ వర్గం సైతం ఎంపీ వ్యాఖ్యలపై గుర్రుగా ఉంది.
టీడీపీలో తమకు న్యాయం జరుగుతుందని భావించి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినందుకు ఇదేనా తమకు లభించే గుర్తింపు అని ప్రశ్నిస్తున్నారు వారు. ఇటీవలి ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన వెంటనే నాగుల్ మీరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని పార్టీకి రాజీనామా చేసేందుకూ సిద్ధమయ్యారు. ఆమె పోటీ చేయరాదంటూ ఫత్వా జారీ కావడం వెనుకా నాగుల్ మీరా హస్తం ఉందని జలీల్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాని నాగుల్ మీరా పేరు తేవడంతో రచ్చ మొదలైంది.