తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడిపై ఘాటు విమర్శలు చేసిన ఎంపీ ఈ సందర్భంగా తమ పార్టీకే చెందిన అమాత్యుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లీపర్ కోచ్ ల కోసమే ఇతర రాష్ట్రాల బస్సులను ప్రోత్సహించామని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్లపై స్పందించిన కేశినేని నాని మంత్రి అచ్చెన్న కామెంట్లు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం చేసే వాటి విషయంలో పకడ్బందీగా వ్యవహరించాల్సిన సమయంలో మంత్రి స్పందించిన తీరు ఆశ్చర్యకరంగా ఉందని కేశినేని నాని అన్నారు. ప్రజల సౌకర్యం పేరుతో వ్యభిచార గృహాలు - పేకాట క్లబ్ లకు అనుమతిస్తారా అంటూ మంత్రి అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రి లోకేష్ మాట్లాడితేనే పార్టీ అభిప్రాయమని, మిగిలిన వారు మాట్లాడితే అది వ్యక్తిగతమవుతుందన్నారు. రవాణాశాఖలో అవినీతిని అరికట్టడంలో కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం విఫలమయ్యారన్నారు. గత రెండున్నరేళ్లలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు రవాణ శాఖలో పెరిగిపోయాయని అన్నారు. తాము ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పెడచెవిన పెట్టారని, చర్యలు తీసుకోలేదని నాని ఆవేదన వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/