తనను హత్య చేసేందుకు రెక్కీని నిర్వహించినట్లుగా వంగవీటి రాధా చేసిన ప్రకటన సంచలనంగా మారటమే కాదు.. ఏపీ ప్రభుత్వం సైతం వెంటనే స్పందించటం తెలిసిందే. ఆయన భద్రత పెంపునకు..సెక్యూరిటీని పంపటం.. ఇందుకు వంగవీటి రాధా నో చెప్పేసి.. వెనక్కి పంపటం తెలిసిందే. వంగవీటి రాధా ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబుస్వయంగా వెళ్లి.. పరామర్శించటం.. వివరాలు సేకరించటం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఆదివారం విజయవాడ పోలీసులు ఆసక్తికర ప్రకటన చేశారు.వంగవీటి రాధాపై ఎలాంటి రెక్కీ నిర్వహించలేదన్న విషయం తమ విచారణలోవెల్లడైందని పేర్కొన్నారు. పోలీసుల వ్యాఖ్యపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ.. రాధా ఇంటికి విజయవాడ ఎంపీ కేశినేని నాని వెళ్లారు. మీడియాతో మాట్లాడిన కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాధాను హత్య చేయటానికి రెక్కీ నిర్వహించిన వారిపై సూటిగా చెప్పని నాని.. పరోక్షంగా చెప్పటం గమనార్హం.
టీడీపీ ఆఫీసుపై.. పట్టాభి ఇంటిపైనా ఎవరైతే దాడి చేశారో.. వారే రాధా ఆఫీసు వద్ద రెక్కీ నిర్వహించినట్లుగా నాని పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఎన్టీఆర్.. చంద్రబాబులు ఎప్పుడూ హత్యారాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. వంగవీటి రాధా.. రంగా అనుచరులు స్వార్థ ప్రయోజనాల కోసం.. హత్యా రాజకీయాలు చేయటంతోరంగా చనిపోయారన్నారు. ఇదిలా ఉంటే.. వంగవీటి రాధాను చంపటానికి రెక్కీ చేసింది దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు వెంకట సత్యనారాయణ అలియాస్ అరవ సత్యమన్న ప్రచారం జోరుగా సాగటం తెలిసిందే.
అయితే.. అరవ సత్యం కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అరవ సత్యం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని.. అలాంటి ఆయన ఎలా హత్యకు ప్లాన్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అరవ సత్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగిందని.. ఆ టెన్షన్ తో బీపీ పెరిగి ఆసుపత్రిలో చేరారని చెబుతున్నారు. మరి..ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై వంగవీటి రాధా ఎలా స్పందిస్తారో చూడాలి.