దేశం లో కీలక పరిణామం... అయినా జాగ్రత్త తప్పనిసరి

Update: 2021-12-26 04:03 GMT
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ప్రక్రియలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. మనదేశంలోనూ టీకా ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కాగా దేశంలో ఇప్పటివరకు 18 ఏళ్లు పైబడినవారికే టీకా అందిస్తున్నారు. మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి పిల్లలకు టీకా ఇవ్వడానికి అనేక సంస్థలు ప్రయోగాలు చేశాయి. కొన్ని దేశాల్లో పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాగా మనదేశంలోనూ పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో కీలక అడుగు పడింది. ఇప్పటివరకు 18 ఏళ్లు పైబడిన వారికి అందించే టీకా... ఇకపై పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ పిల్లల కోసం రూపొందించిన వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతి లభించాయి. 12-18 ఏళ్ల వారికి కొవిడ్ టీకా ఇవ్వడానికి ఆమోదం తెలిపింది.

భారత్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ ను అభివృద్ధి చేసింది. ఈ టీకాను రెండు డోసులుగా ఇస్తున్నారు. అయితే పెద్దల మాదిరిగా పిల్లలకు కూడా రెండు మోతాదుల్లో టీకాను ఇవ్వనున్నారు. మొదటి డోసు టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసును ఇవ్వనున్నారు. పిల్లలకు టీకా కోసం తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఫలితంగా ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే పిల్లలకు కూడా వ్యాక్సిన్ కావాలని కోరుకుంటున్నారు.

దాదాపు రెండేళ్లుగా మహమ్మారి విజృంభిస్తోంది. వేరియంట్ల రూపంలో కోరలు చాస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ పేరిట విలయతాండవం చేస్తోంది. అయితే దీనిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే శక్తివంతమైన మార్గం. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో బూస్టర్ డోసును కూడా అందిస్తున్నాయి. ఇక కొన్ని దేశాలు ఇప్పటికే పిల్లలకు టీకా ఇస్తున్నారు. ఇకపై మనదేశంలోనూ చిన్నారులకు టీకా అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ రూపొందించిన పిల్లల టీకాకు డీసీజీఐ అనుమతి రావడం పట్ల వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆమోదంతో దేశంలో మరో కీలక అడుగు పడిందని భావిస్తున్నారు.
Tags:    

Similar News