తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రక్రియను మహా జోరుగా సాగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ నేతలంతా ఇప్పుడు కేసీఆర్ తిట్టుడు కార్యక్రమాన్ని షురూ చేశారు. ఏ చిన్న అవకాశం లభించినా కేసీఆర్ ను ఉతికి ఆరేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాయుత్తమవుతున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో కేసీఆర్ సర్కారుకు ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. తాజాగా కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ రామచంద్ర కుంతియా ఈ మధ్యన తెలంగాణ సీఎం మీద ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని.. హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు భూములు.. సొమ్ములు ఇచ్చి కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కొనసాగించటం ఏ రకమైన రాజనీతి అంటూ ప్రశ్నించారు.
కేంద్రంలో.. రాష్ట్రంలో ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల్ని తమ పార్టీ చూస్తూ ఊరుకోదని.. తగిన సమయంలో తగిన రీతిలో బదులు తీర్చుకుంటారన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సోనియా.. రాహుల్ నేతృత్వంలో తమ పార్టీ విజయం పక్కా అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపే వారే లేరన్న ధీమాను వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో మాటల దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రం చేసింది. అయితే.. వీటికి కౌంటర్ గా కేసీఆర్ స్పందించింది లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ గా కుంతియా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి కేసీఆర్ ఆయనపై ఎలాంటి విమర్శ చేయలేదు. ఇటీవల కాలంలో తెలంగాణలో పర్యటిస్తున్న కుంతియా మాత్రం.. అంతకంతకూ కేసీఆర్ మీద విమర్శల తీవ్రతను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మార్క్ విమర్శల పంచ్ లు కుంతియా మీద పడటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. కుంతియా మాటలు కేసీఆర్ నోటికి పని చెప్పేలా ఉన్నాయని చెప్పక తప్పదు.