పొలార్డ్‌ కు మంట పుట్టింది.. బ్యాట్ గాల్లో ఎగ‌రేశాడు

Update: 2019-05-13 10:30 GMT
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఒక ఉదంతంపై పొలార్డ్ త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. త‌న తీరుతో అత‌గాడి నిర‌స‌న‌ను తెలియ‌జేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. పుట్టిన‌రోజు వేళ‌.. పొలార్డ్ ఆట తీరు క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పేలా ఉంద‌న్న విమ‌ర్శ వినిపించినా.. అంపైర్ల త‌ప్పిదం మాటేమిటంటూ ప్ర‌శ్నిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాని ప‌రిస్థితి.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ సాధించ‌టంలో కీర‌న్ పొలార్డ్ కీల‌క‌భూమిక పోషించిన వైనాన్ని మ‌ర్చిపోలేం. క‌ప్ గెల‌వ‌టానికి కార‌ణం పొలార్డ్ సాధించిన 41 ప‌రుగులు కీల‌క‌మ‌నే చెప్పాలి. చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్ డ్వేన్ బ్రావో వేసిన చివ‌రి ఓవ‌ర్లో వ‌రుస‌గా రెండు బంతులు ట్రామ్ లైన్స్ దాటి దూరంగా వెళ్లాయి. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. వీటిని వైడ్లుగా ప‌రిగ‌ణించాలి.

కానీ.. అంపైర్లు మాత్రం వాటిని మామూలు బంతులుగా ప‌రిగ‌ణించారు. వైడ్ గా వెళ్లిన బంతుల్ని మామూలుగా బంతులుగా ప‌రిగ‌ణించ‌టాన్ని కామెంటేట‌ర్లు సైతం త‌ప్పు ప‌ట్టారు. క్ర‌జీ్ కు దూరంగా బంతులు వెళ్లిన‌ట్లు స్ప‌ష్టంగా కనిపిస్తున్నా.. అంపైర్ వైడ్ ఇవ్వ‌క‌పోవ‌టం పొలార్డ్ కు కోపం వ‌చ్చింది. దీంతో అత‌గాడు త‌న బ్యాట్ ను గాల్లోకి ఎగుర‌వేశారు. అనంత‌రం మ‌రో బాల్ వేసేందుకు సిద్ధ‌మైన  బ్రావో ప‌రుగెత్తుకొస్తుంటే.. పొలార్డ్‌.. అంత‌కు ముందు బంతి ప‌డిన ట్రామ్ లైన్స్ వ‌ద్ద బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌య్యాడు. వికెట్ల‌కు పూర్తిగా ప‌క్క‌కు జ‌రిగి బౌలింగ్ చేసేందుకు వ‌చ్చిన బ్రేవో తాను బంతిని వేయ‌కుండా విర‌మించుకోవాల్సి వ‌చ్చింది.

దీంతో.. అంపైర్లు పొలార్డ్ వ‌ద్ద‌కు వ‌చ్చి అత‌న్ని స‌ముదాయించే ప్ర‌య‌త్నం క‌నిపించింది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై బీసీసీఐ మాత్రం సీరియ‌స్ అయ్యింది. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత అత‌నికి భారీగా జ‌రిమానా విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. పొలార్డ్ చేసిన త‌ప్పిదం మీద వివ‌రాలు వెల్ల‌డించ‌ని ఐపీఎల్ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ.. జ‌రిమానా కింద మ్యాచ్ ఫీజును భారీగా కోత పెట్ట‌టం విశేషం. మ‌రి.. అంపైర్లు త‌ప్పు చేసిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపించిన వైనంపై ఐపీఎల్ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ ఎందుకు దృష్టి సారించ‌దు?  త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పే క‌దా?  అంపైర్ల త‌ప్పుల విష‌యంలో గ‌తానికి భిన్నంగా నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌ని చెప్పాలి. మ‌రి.. దీనిపై ఐపీఎల్ జ‌ట్ల యాజ‌మాన్యాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. అంపైర్ల త‌ప్పిదంతో మ్యాచ్ మిస్ అయితే.. జ‌రిగే న‌ష్టం మామూలుగా ఉండ‌దు క‌దా?

Click Here For Video
Tags:    

Similar News