అల్లాహు అక్బ‌ర్ అంటే కాల్చేయ‌మ‌న్న మేయ‌ర్‌

Update: 2017-08-25 07:03 GMT
నిజంగానే నిజం.  అల్లాహు అక్బ‌ర్ అంటూ న‌గ‌రంలోని బ‌హిరంగ ప్ర‌దేశాల్లోనూ.. వేదిక‌ల మీద‌ ఎవ‌రు అరిచినా స‌రే.. వెంట‌నే వారిని అక్క‌డిక‌క్క‌డే కాల్చిపారేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు ప్ర‌ఖ్యాత న‌గ‌రానికి చెందిన మేయ‌ర్ ఒక‌రు. అంతేనా.. బ‌హిరంగంగా ఎవ‌రైనా స‌రే.. అల్లాహు అక్బ‌ర్ అన్న నినాదాన్ని చేసినంత‌నే వారిని తాము నేరుగా అల్లా వ‌ద్ద‌కే పంపుతామంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య చేశారు. ఇంత‌కీ ఇలాంటి వ్యాఖ్య చేసిందెవ‌రు? ఆయ‌న ఎక్క‌డ ఉంటారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చూస్తే..

ఇట‌లీలోని వెనిస్ న‌గ‌రాన్ని ప్ర‌పంచంలో అతి సుంద‌ర ప్ర‌దేశాల్లో ఒక‌టిగా చెబుతుంటారు. ఈ న‌గ‌ర మేయ‌ర్ లూగి బ్రూగ్ నారో. ఇటీవ‌ల స్పెయిన్ రాజ‌ధాని బార్సిలోనా న‌గ‌రంలో ట్ర‌క్కుతో ప‌ద‌మూడు మంది ప్రాణాలు తీసిన ఉగ్ర‌ఘ‌ట‌న నేప‌థ్యంలో ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

వెనిస్ లోని ప్ర‌ఖ్యాత సెయింట్ మార్క్ స్వ్కేర్ వ‌ద్ద ఎవ‌రైనా స‌రే.. అ్ల‌లాహు అక్బ‌ర్ అంటూ అరిస్తే.. అలా జ‌రిగిన మూడు.. నాలుగు సెక‌న్ల లోపే త‌మ స్నైప‌ర్లు వారిని నేరుగా అల్లా వ‌ద్ద‌కే పంపుతామ‌ని హెచ్చ‌రించారు. బార్సిలోనా కంటే వెనిస్ చాలా సుర‌క్షిత‌మైన‌ద‌న్న ఆయ‌న‌.. ఒక ర్యాలీని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉగ్రదాడిని  ఎదుర్కోని ఇట‌లీపై ఐసిస్ తీవ్ర‌వాదులు త‌ర‌చూ హెచ్చ‌రిక‌ల మీద హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు.

ఇటీవ‌ల కాలంలో బాంబుల కంటే కూడా భారీ వాహ‌నాల్ని పాద‌చారుల మీద ఇష్టారాజ్యంగా న‌డిపించ‌టం ద్వారా పెద్ద ఎత్తున అమాయ‌కుల ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఉదంతాల్ని అడ్డుకునేందుకు వీలుగా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పిన వెనిస్ మేయ‌ర్‌.. బ‌హిరంగంగా అల్లాహు అక్బ‌ర్ అంటూ అరిచిన వెంట‌నే ఎలాంటి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేయ‌కుండానే కాల్చి చంపేయాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. వెనిస్ మేయ‌ర్ ప్ర‌క‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News