కిమ్ జాడ తెలిసింది.. ఇక్కడే ఉన్నాడట?

Update: 2020-04-26 17:30 GMT
ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. అతడు చావుబతుకుల మధ్య ఉన్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన జాడ బయటపడింది. దేశంలోని రిసార్ట్ టౌన్ లో కిమ్ కుటుంబసభ్యులకు ప్రత్యేకమైన స్పెషల్ రైలు ఏప్రిల్ 21, 23 తేదీల్లో కనిపించినట్టు వాషింగ్టన్ పర్యవేక్షణ ప్రాజెక్ట్ తెలిపింది. శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాల్లో  లీడర్ షిప్ స్టేషన్ లో ఆ ప్రత్యేక రైలు ఆచూకీ బయటపడిందని పేర్కొంది.

ఇక ఆ ప్రత్యేక రైలులోనే కిమ్ ఉండే అవకాశం ఉందని వాషింగ్టన్ ప్రాజెక్టు అభిప్రాయపడింది.  కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించిన దృష్ట్యానే సకల సౌకర్యాలున్న రైలులో ఉన్నాడని.. లేకపోతే అధ్యక్ష భవనానికి వచ్చేవాడని తెలిపింది.

అయితే ప్రఖ్యాత రాయిటర్స్ సంస్థ మాత్రం కిమ్ ఆ రైలులో లేడని.. తూర్పు ఉన్నత ప్రాంతంలో ఉన్నాడని తెలుస్తోందని తెలిపింది.

కిమ్ ఆరోగ్యం బాగాలేకపోతే చైనా నుంచి ప్రత్యేక బృందం ఎందుకు వెళ్లిందన్నది అంతుచిక్కడం లేదు. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉండడంతోనే దేశంలో అధికార మార్పిడి.. దాడి జరగకుండా ఇలా కాపాడుతుండొచ్చు అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


Tags:    

Similar News