కిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు
కిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే తొలిసారిగా ఓ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. విదేశాల్లో అందుబాటులో ఉన్న వైద్యాన్ని హైదరాబాద్ లోనూ ప్రయోగించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా బ్రీతింగ్ లంగ్ మార్పిడి సర్జరీ చేశారు. ఈ మేరకు సర్జరీ సక్సెస్ అయిందని హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ప్రకటించారు.
బ్రీతింగ్ లంగ్ మార్పిడి అంటే ఏంటి? దాని ప్రత్యేకత ఏంటంటే... హార్ట్, లంగ్ యంత్రాన్ని వినియోగించకుండా శస్త్రచికిత్స చేయడం అన్నమాట. ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ట్రీట్ మెంట్ ను... ఇక్కడ చేపట్టి విజయవంతమైనట్లు కిమ్స్ లంగ్స్ మార్పిడి డిపార్టుమెంట్ డైరెక్టర్ సందీప్ తెలిపారు. ఒక ఊపిరితిత్తి పనిచేస్తుండగానే... మరో ఊపిరితిత్తిని సమన్వయం చేసుకుంటూ ఈ అరుదైన ఆపరేషన్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఊపిరితిత్తుల సమస్యతో ఆగస్టులో ఓ వ్యక్తి కిమ్స్ లో చేరారు. మధ్య వయసు కలిగిన ఆ వ్యక్తికి సర్జరీ చేసేందుకు ఈ పద్ధతి ఎంచుకున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. కాగా ఆదివారం ఆయనకు ఈ బ్రీతింగ్ లంగ్ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే ఈ విధానం ద్వారా దాతలు ఇచ్చిన ఊపిరితిత్తుల వినియోగం పెరుగుతుందని వారు పేర్కొన్నారు. దాదాపు 30 శాతం వినియోగం పెరుగుతుందని వివరించారు.
ఈ అరుదైన శస్త్రచికిత్స విధానంతో రోగికి చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. మార్పిడి చేసిన ఊపిరితిత్తులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వారు వివరించారు. కాగా కిమ్స్ వైద్యులు నిర్వహించిన ఈ అరుదైన శస్త్రచికిత్స నిజంగా అభినందనీయం. విదేశాల్లో అందుబాటులో ఉన్న వైద్యం ఇక్కడకు తీసుకు రావడం విశేషం. కాగా హైదరాబాద్ వైద్యులు ఇప్పటికే ఇలాంటి అరుదైన సర్జరీలు చాలా చేశారు.