కింగ్ ఫిష‌ర్ పై సీబీఐ దాడులు

Update: 2015-10-10 18:27 GMT
బ్యాంక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో  సీబీఐ అధికారులు కింగ్‌ఫిషర్‌ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు నెగెటివ్ క్రెడిట్ రేటింగ్స్ ఉన్నా.. ఆ సంస్థకు ఐడీబీఐ బ్యాంకు నుంచి భారీమొత్తంలో రూ. 950 కోట్ల రుణం ఇచ్చిన వ్యవహారంపై సీబీఐ ఈ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఈ కేసులోఢిల్లీ, బెంగళూర్‌, గోవాలోని సంస్ధ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. కింగ్‌ఫిషర్‌ సంస్ధల అధిపతి విజయ్‌మాల్యా ఇళ్లలోనూ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

బ్యాంకింగ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలున్నాయి. క్రికెట్ రంగంలోకి అడుగిడిన త‌ర్వాత మాల్యా క‌ష్టాల పాల‌య్యార‌ని వ్యాపార‌వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతుంటాయి. కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ త‌న సేవ‌ల‌ను అక్టోబ‌రు 2012 నుంచి నిలిపివేసింది. ఈ ఎయిర్‌లైన్స్ ఆస్తుల‌ను నిరర్ద‌క ఆస్తులుగా (ఎన్‌పీఏ)లుగా గుర్తించిన బ్యాంకులు త‌మ లోన్ల మొత్తాల‌ను రాబట్టుకునేందుకు, త‌మ‌ను చీటింగ్ చేసినందుకు సీబీఐకి ఫిర్యాదు చేశాయి.  గ‌త ఏడాదిగా కింగ్‌ఫిష‌ర్ సంస్థ‌ల‌పై ఆర్థిక లావాదేవీల అవ‌కత‌వ‌క‌ల విష‌యంలో బ్యాంకులు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా సీబీఐ సోదాలు నిర్వ‌హించింది. ఈ కేసులో త్వ‌ర‌లో విజ‌య్ మాల్యాను ప్ర‌శ్నించే అవ‌కాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News