మహిళలపై వేధింపుల విషయంలో దేశంలోని ప్రజాప్రతినిధులు ఒక్కోసారి వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తదితరులు చేసిన వ్యాఖ్యలు ఇంతకుముందు దేశవ్యాప్తంగా విమర్శలకు గురయిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.
కర్ణాటకలో జరిగిన ఓ అత్యాచార ఘటనపై అక్కడి హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు కలిసి మహిళ మీద రేప్ చేస్తే అది అత్యాచారం అవుతుందని, గ్యాంగ్ రేప్ కాదని ఆయన మీడియా సమావేశంలో చెప్పడంతో దూమరం చెలరేగింది.బెంగళూరులో 22 సంవత్సరాల బీపీఓ కంపెనీ ఉద్యోగినిపై ఇద్దరు అత్యాచారం చేసిన కేసు విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
''ముగ్గురు లేక నలుగురి కంటే ఎక్కువ మంది మహిళపై అత్యాచారం చేస్తే అది గ్యాంగ్ రేప్.. ఒకరిద్దరు చేస్తే అది రేప్ మాత్రమే'' అన్న ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జార్జ్ చేసిన వ్యాఖ్యలతో పలు మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. హోంమంత్రి అయి ఉండి ఇంత లూజ్ కామెంట్లు చేస్తారా అని మండిపడుతున్నారు. అత్యాచారాల నియంత్రణకు ప్రభుత్వం ఏమీ పట్టించుకోవాడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా బీపీఓ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన సునీల్ ఓంకారప్ప (23), యోగేష్ మల్లేషప్ప (27) అనే ఇద్దరు కామాంధులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.