టీ కాంగ్రెస్ లో మరో నేత రాజీనామా చేశారు. రంగారెడ్డి జిల్లాలో కీలక నేతగా ఉన్న కెఎం ప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ ఆ పార్టీ మరింత బలహీనపడింది. కాగా చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన రాజీనామా చేస్తారని చాలాకాలంగా అనుకుంటున్నా కూడా ఎప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీలో కొనసాగుతారని భావించారు. అయితే... ఎలాంటి హడావుడి లేకుండా ఒక్కసారిగా ఆయన రాజీనామా ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. తాజాగా ఆయన శుక్రవారం కుత్బుల్లాపూర్ లో విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్న విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పై పలు ఆరోపణలు చేశారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అయితే... తెలంగాణలో చేరడానికి టీఆరెస్ తప్ప వేరే పార్టీ లేదని... ఆయన అందులోనే చేరుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.