షాకింగ్.. రాష్ట్రపతి భవన్ వద్దే చోరీ చేశారు

Update: 2019-11-29 07:45 GMT
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని చెప్పే రాష్ట్రపతి భవన్ వద్ద చోరీ జరగటం సంచలనంగా మారింది. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు అప్రమత్తమయ్యారు.

అరుణ్ జైన్ అనే కాంట్రాక్టరు జోర్ బాగ్ ప్రాంతం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పైపులు వేసేందుకు గేటు నెంబరు23 - 24 గేటు వద్ద పైపులు ఉంచాడు. అయితే.. గేటు దగ్గర పెట్టిన పైపులు మాయమయ్యాయి. దీంతో ఉలిక్కి పడిన కాంట్రాక్టర్లు వెంటనే పోలీసులను ఆశ్రయించి.. కంప్లైంట్ ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు  సీసీ కెమేరాల ఫుటేజ్ ను పరిశీలించారు. ఆజంగఢ్ ప్రాంతానికి చెందిన అజయ్ అనే వ్యక్తి సిఫ్ట్ డిజైర్ కారులో రాష్ట్రపతి భవన్ వద్దకు వచ్చి పైపులు చోరీ చేసినట్లుగా గుర్తించారు. అనంతరం వాటిని అమ్మేసినట్లుగా తేలింది. దీంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. రాష్ట్రపతి భవన్ వద్ద చోరీ చేయటం సంచలనంగా మారింది.


Tags:    

Similar News