ఎన్టీ రామారావు సొంతూరు నిమ్మకూరు ఉన్న గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు నాయుడుతో విభేధించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నాని దూరమై జగన్ కు దగ్గరయ్యాడు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ చక్రం తిప్పి నానికి వ్యతిరేకంగా రావి వెంకటేశ్వరరావును నిలబెట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసినా కొడాలి నాని ని దెబ్బకొట్టలేకపోయారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు నేపథ్యంలో కొడాలి నాని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద పోటుగాడు ఏం కాదు .. ఆయన చెప్పుకునేటట్లు అనుభవజ్ఞుడు కూడా కాదు. నంద్యాల ఎన్నికల్లో గెలిచామని, ప్రజలు మా పాలనకు హారతులు పడుతున్నారని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అయిపోయిందని చెబుతున్న చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేర్చుకున్న 21 మంది ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఇంకా దమ్ముంటే ఆంధ్రాలోని 175 స్థానాల్లో పోటీకి వస్తే దానిని తాము రిఫరెండంగా స్వీకరిస్తామని కొడాలి నాని అన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు ఎంపీ స్తానాలలో డిపాజిట్ దక్కలేదని, 44 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 21 స్థానాలకు డిపాజిట్ రాలేదని, 10 స్థానాలలో మూడోస్థానంతో తృప్తి పడ్డారని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దొడ్డి దారులు వెతుకుతాడని, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని నాని స్పష్టం చేశారు.