కోదండం మాష్టారు నోట ‘‘బాబు పవర్’’ మాట

Update: 2015-10-25 06:46 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాం విరుచుకుపడ్డారు. చంద్రబాబు తీరుతో తెలంగాణ రాష్ట్రం చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటోందని వ్యాఖ్యనించారు. చంద్రబాబుకు కేంద్రం ఇచ్చిన పవర్స్ గురించి ఆయన విమర్శనాత్మకంగా మాట్లాడారు.

రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కూడా.. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబుకే అధికారాన్ని కట్టబెట్టినట్లుగా ఆయన విమర్శించారు. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. ‘‘హైకోర్టును విభజించాలని కేంద్రాన్నికోరితే చంద్రబాబు లేఖ రాస్తే తప్ప చేయమంటున్నారు. రాష్ట్రపతి చేయాల్సిన పనిని చంద్రబాబు లేఖ రాస్తే తప్ప కాదని ఎలా చెబుతారు? ఉద్యోగుల విభజనకు ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ కూడా పని చేయటం లేదు. కమిటీ కాల పరిమితిని పెంచుకుంటూ పోతున్నారే తప్ప మరొకటి లేదు. ఆంధ్రా ప్రాంతంలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు నిత్యం అవమానాలు ఎదుర్కొంటున్నారు. వారిని వెనక్కి తెచ్చేందుకు తెలంగాణ సర్కారు లేఖలు రాసిని ప్రయోజనం ఉండటం లేదు’’ అంటూ మండిపడ్డారు.

మొత్తానికి చంద్రబాబు పవర్ గురించి ఇంతగా చెబుతున్నకోదంరాం మాష్టారు.. నిజంగా బాబుకు ఇంత సీన్ ఉంటే.. తన రాష్ట్రానికి కావాల్సినవి ఎందుకు చేయించుకోనట్లు? అయినా.. విభజన జరిగిన తర్వాత కూడా తన రాష్ట్ర సిబ్బందిని కాకుండా తెలంగాణ సిబ్బందిని అట్టిపెట్టుకుంటే బాబుకు వచ్చే ప్రయోజనం ఏమిటి..? ఇలాంటి సందేహాలు రాక ముందే.. అలాంటి అంశాలకు కూడా కోదండం మాష్టారు వివరణ ఇస్తే బాగుంటుంది కదా.
Tags:    

Similar News