కోదండం మాష్టారి కొత్త పార్టీ పేరు అదేన‌ట‌

Update: 2017-12-25 13:28 GMT
తెలంగాణ అధికార‌ప‌క్షానికి స‌వాలు విసిరేందుకు స‌రికొత్త‌గా వ‌చ్చేస్తోంది మ‌రో రాజ‌కీయ పార్టీ. త‌మ లాంటి ఉద్య‌మ బ్యాక్ గ్రౌండ్ తెలంగాణ‌లోని మ‌రే ఇత‌ర పార్టీకి లేద‌ని చంక‌లు గుద్దుకునే కేసీఆర్ అండ్ కోకు కొత్త స‌వాల్ విసిరేలా  ప్రొఫెస‌ర్ కోదండ‌రాం కొత్త పార్టీని అనౌన్స్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం కొత్త పార్టీ ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లుగా సాగితే.. కొత్త సంవ‌త్స‌రం తొలి నెల‌లోనే పార్టీని రిజిష్ట‌ర్ చేసే దిశ‌గా ఏర్పాట్లు సాగుతున్నాయి.   ఈ నెలాఖ‌రు నాటికి తెలంగాణ అమ‌రవీరుల స్ఫూర్తి యాత్ర‌లు పూర్తి కావొస్తున్నాయి. అనంత‌రం పార్టీ ఏర్పాటు పైనే దృష్టి పెడ‌తార‌ని చెబుతున్నారు.

కొత్త‌గా పార్టీ పెట్టే విష‌యంలో సానుకూలంగా ఉన్న కోదండం మాష్టారు.. పార్టీ పేరు ఏం పెడ‌తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మాష్టారికి స‌న్నిహితంగా ఉండే వారిలో మెజార్టీ టీజేఎస్ గా పెడితే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. టీజేఏసీకి ద‌గ్గ‌ర‌గా ఉంటే తెలంగాణ జ‌న స‌మితి (టీజేఎస్‌) లేదంటే.. తెలంగాణ స‌క‌ల జ‌న స‌మ‌తి అన్న రెండు పేర్ల‌లో ఒక‌టి ఖాయ‌మ‌వుతుందంటున్నారు. వీలైనంత వ‌ర‌కూ మొద‌టి పేరునే క‌న్ఫ‌ర్మ్ చేస్తార‌ని చెబుతున్నారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక యూనిట్ గా చేసుకొని.. గ్రామ‌స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెడ‌తార‌ని చెబుతున్నారు. గ్రామ‌.. మండ‌ల.. నియోజ‌క‌వ‌ర్గ‌ స్థాయిలో  పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్ట‌నున్నారు.

తెలంగాణ ఉద్య‌మానికి ఏ అంశాలైతే నినాదాలుగా మారాయో.. ఇప్పుడవే అంశాలు కోదండం మాష్టారి పార్టీ అజెండా మార‌నున్న‌ట్లు చెబుతున్నారు. నీళ్లు.. నిధులు.. నియామ‌కాల విష‌యంలో తెలంగాణ స‌ర్కారు వైఫ‌ల్యాల్ని ఎండ‌గ‌ట్ట‌ట‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తార‌ని చెబుతున్నారు. తెలంగాణ ఉద్య‌మం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌ల్ని క‌దిలించిన అంశాల్లో ఏ ఒక్క‌టి సొంత రాష్ట్రంలో ఆచ‌ర‌ణ‌లోకి రాలేద‌న్న విష‌యంపై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం పెంచేలా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News