ఫారిన్ ట్రిప్ లో ఏం జరిగింది కోదండం సార్?

Update: 2016-05-27 07:02 GMT
తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి.. తెలంగాణ ప్రజల్లో అసలుసిసలు ఉద్యమనేతగా మన్ననలు పొందిన ప్రొఫెసర్ కోదండరాం పేరే ఒక బ్రాండ్ గా చెప్పొచ్చు. ఉద్యమంలో పాల్గొన్న వారంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదో ఒకపదవిని చేపట్టి సెటిల్ అయిపోతే.. కోదండం మాష్టారు మాత్రం అందుకు భిన్నంగా పుస్తకం పట్టుకొని ఉస్మానియా విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఇష్టపడటం తెలిసిందే.

ఈ మధ్యనే ప్రొఫెసర్ బాధ్యతల నుంచి రిటైర్ అయిన కోదండరాం పలు ప్రజా సమస్యల మీద తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తొలి నుంచి తెలంగాణ అధికారపక్షంపై ఆచితూచి విమర్శలు చేస్తున్న ఆయన.. ఈ మధ్యన అప్పుడప్పుడు తెలంగాణ ప్రభుత్వ తీరు ఎ విమర్శలు చేస్తున్న ఆయన తాజాగా కీలక వ్యాఖ్య చేయటం గమనార్హం.

దాదాపు మూడువారాలకు పైనే ఫారిన్ ట్రిప్ వెళ్లి వచ్చిన ఆయన.. జేఏసీ కమిటీతో తన అనుభవాన్ని పంచుకున్న కోదండం.. తెలంగాణలో జేఏసీ రాజకీయ ప్రత్యమ్నాయ శక్తిగా ఎదగాలని పలువురు కోరుకుంటున్నట్లగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జేఏసీ రాజకీయాలకు అతీతంగా పని చేయాలని భావిస్తున్నా.. అందుకు భిన్నంగా ప్రజల పక్షాన పని చేయాలని కొందరు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  ఉద్యమ సమయం లో చెప్పిన మాటల్ని నిజం చేయాలంటే జేఏసీ రాజకీయ ప్రత్యమ్నాయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం తన దగ్గర పలువురు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్న మాటలు చూస్తుంటే.. కోదండం మాష్టారి తాజా ఫారిన్ ట్రిప్ లో ఏదో జరిగిందన్న భావన వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. భవిష్యత్తులో చోటు చేసుకునే పరిణామాలకు మాష్టారి తాజా మాటలు ఆరంభంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News