టీఆర్ ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్కంఠ రేకెత్తిస్తున్న సీట్ల పంపకం ఓ క్లారిటీ రాని నేపథ్యంలో ఢిల్లీ రంగంలోకి దిగింది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు చర్చించేందుకు రావాల్సిందిగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ కు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలువు వచ్చింది. రాహుల్ ఆహ్వానం మేరకు నవంబర్ 2న కోదండరామ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 9.30కి రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత ఎవరికెన్ని సీట్లు అనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం వచ్చింది.
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ ఎస్ తొలి 105మంది జాబితాను ఖరారు కేసిన ప్రచారంలో దూసుకుపోతున్న క్రమంలో కూడా ఎన్నికల సమయం దగ్గరకొస్తున్నా కాంగ్రెస్ సీట్ల సంఖ్యపైనా...స్థానాల ఖరారు పైనా స్పష్టత ఇవ్వకపోవటంతో మిగిలిన ప్రధాన పార్టీలు టీడీపీ - కాంగ్రెస్ - కోదండరాం పార్టీలు కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వాములైన కోదండరామ్ తో సీట్ల గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ గాంధీ తనను కలవాలంటూ కోదండరామ్ కు ఫోన్ చేశారు. శుక్రవారం ఉదయం 9.30గంటలకు కోదండరామ్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో కోదండరామ్ గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరనున్నారు. అనంతరం శుక్రవారం రాహుల్ గాంధీతో సీట్ల సర్దుబాటు ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కోదండరామ్ చర్చించనున్నారు. అలాగే సీట్ల సర్దుబాటుపై కూడా ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ విధించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నుంచి ఫోన్ రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.