కోడెల ఆత్మహత్య మిస్టరీ.. సెల్ ఫోన్ మాయం..

Update: 2019-09-17 10:01 GMT
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

అయితే ఉదయం భార్యతో టిఫిన్ చేసిన కోడెల మొదటి అంతస్తులోకి వెళ్లి ఉదయం 10.10 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో ఉదయం 8.30 గంటలకు కోడెల దాదాపు 24 నిమిషాల పాటు ఎవరితోనూ సెల్ ఫోన్ లో మాట్లాడారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది..

ఇప్పుడు కోడెల మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఎందుకు మాట్లాడారు? ఏం మాట్లాడారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా కోడెల సెల్ ఫోన్ మాయం అవ్వడం ఇప్పుడు పోలీసులకు షాకింగ్ గా మారింది.

కోడెల సెల్ ఫోన్ కోసం గాలించిన పోలీసులకు అది దొరకలేదు. సోమవారం సాయంత్రం నుంచి కోడెల ఉపయోగించే సెల్ ఫోన్ కనిపించడం లేదని పోలీసుల విచారణలో తేలింది. మొబైల్ సోమవారం సాయంత్రం స్విచ్ఛాఫ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో చివరగా కోడెల మాట్లాడిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు కాల్ డేటా ను సేకరిస్తున్నారు. దాని ఆధారంగా విచారణ జరుపుతున్నారు. సెల్ ఫోన్ మిస్సింగ్ తో కోడెల ఆత్మహత్య వ్యవహారం మిస్టరీగా మారింది.


Tags:    

Similar News