బరువైన బ్యాగ్ తో కోహ్లి..: అందులో ఏముందంటే..?

Update: 2021-12-20 06:03 GMT
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ కు కూడా వెళ్లకుండా ఇంటికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కెప్టెన్ కోహ్లి ఏం చేసినా మీడియాలో హైలెట్ అవుతోంది. విమర్శలు, ప్రశంసలు, ప్రత్యేక పరిస్థితుల్లో కోహ్లిని ఎడా పెడా వాడేస్తున్నారు. దీంతో విరాట్ క్రికెటర్ గా కాకుండా న్యూస్ మేకర్ గా మారాడు. తాజాగా ఆయన పెద్ద బ్యాగ్ తో కనిపించాడు. క్రికెట్ కిట్ వేసుకునే ఈ బ్యాగ్ భారీగా కనిపిస్తోంది. ఆ బ్యాగును విరాట్ చాల కష్టంగా మోసుకెళ్తున్నాడు. ఈ ఫొటో మీడియా కంట పడి చక్కర్లు కొట్టి.. చివరికి వైరల్ గా మారింది. అయితే కోహ్లి అంత పెద్ద బరువున్న బ్యాగును ఎందుకు మోసుకెళ్తున్నాడు..? ఆ బ్యాగులో ఏముంది..? అన్న చర్చ సాగుతోంది.

ఇటీవల న్యూజిలాండ్ టెస్టు ముగిసిన తరువాత తీరికలేకుండా విరాట్ కోహ్లి సౌతాఫ్రికా సిరీసుల్లో పాల్గొననున్నాడు. ఈ నెల 26న సెంచూరియాన్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఇందులో పాల్గొనేందకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న విరాట్ ఇలా భారీ బ్యాగుతో కనిపించాడు. అయితే విరాట్ ప్రాక్టీస్ కు వెళ్తుండగా ఈ బ్యాగును తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ కు ఇంత పెద్ద బ్యాగ్ అవసరమా..?అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే విరాట్ అభిమానులు మాత్రం కౌంటర్తో సమాధానం ఇస్తున్నారు.

సాధారణంగా కోహ్లి ఇలాంటి టెస్టులు ఆడే టప్పుడు తన బ్యాగులో 10 బ్యాట్ లు, 10 జతల గ్లోబ్లు తీసుకెళ్తాడని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పడు కూడా బ్యాగులో ఉన్నవి బ్యాట్లు, గ్లోబులే అని అంటున్నారు. అయితే ఇది సాధారణమే అయినా కొందరు ఈ ఫొటోతో వ్యంగాస్త్రాలు విసురుతున్నారు. ఇటీవల కెప్టెన్సీ వివాదంలో విరాట్ పై అనేక కథనాలు వస్తున్నాయి. అతని స్థానంలో మరో కెప్టెన్ వస్తారని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ చివరికి ఈ సీరీస్ కు కోహ్లినే సారధ్యం వహిస్తున్నాడు.

2018లో సౌతాఫ్రికాలో జరిగిన సిరీసులో కోహ్లి సెంచూరియన్ వేదికగా 153 పరుగులు చేశారు. ఈసారి కూడా కోహ్లి చెలరేగుతారని అంటున్నారు. అయితే కోహ్లికి ఇది ఇక్కడ తొలి టెస్ట్ కావడం విశేషం. ఆ సమయంలో కప్ కోల్పోయినా ఈసారి ఎలాగైనా సిరీసును కైవనం చేసే దిశగా ముందుకెళ్తారని అంటున్నారు. అయితే కోహ్లి ఎలాంటి ప్రదర్శన ఇస్తారోనని ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

దక్షిణాఫ్రాకా పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఇంత వరకు ఇక్కడి నుంచి భారత్ కప్ గెలుచుకోలేదు. సఫారీ గడ్డపై ఇప్పటి వరకు భారత్ 7 టెస్ట్ సిరీస్ లు ఆడగా.. 6 ఓడిపోయింది. ఒకటి డ్రాగా మిగిలింది. ఈ క్రమంలో తొలిసారి సౌతాఫ్రికా నుంచి కప్ తీసుకొచ్చి చరిత్ర సృష్టించాలని కోహ్లి తహతహలాడుతున్నాడు. అయతే ఇటీవల భారత్ న్యూజిలాండ్ సీరీసుల్ జోరు ఆటను ప్రదర్శించినా వరల్డ్ వైడ్ వెళ్లే సరికి చతికిల పడుతోంది. అయితే న్యూజిలాండ్ జోష్ లో ఉన్న ఆటగాళ్లు సఫారీ గడ్డపై ఏ విధంగా ఆడుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ కొందరు క్రికెట్ నిపుణులు మాత్రం కోహ్లి సేన కచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని అంటున్నారు. 2-0 లేదా 2-1 తేడాతో కప్ తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత జట్టు చాలా పటిష్టంగా ఉందని, అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని అంటున్నారు. జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లు ఉన్నా.. వాల్లు అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.
Tags:    

Similar News