కెప్టెన్సీ తొలగింపుపై ఎట్టకేలకు నోరు విప్పిన కోహ్లి..
విరాట్ కోహ్లి ‘టీమిండియా కెప్టెన్సీ వివాదం ’పై నోరువిప్పాడు. ఎట్టకేలకు అసలేం జరిగిందో చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బుధవారం ముంబైలో మీడియాతో మాట్లాడాడు.
వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందు సమాచారం ఇచ్చారని వాపోయాడు. అంతేకాదు.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. విరాట్ ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ గత వారం సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
బాధ్యతలు చక్కగా నెరవేర్చా..
తనకు అప్పగించిన బాధ్యతలను ఇన్నాళ్లూ చక్కగా నెరవేర్చానని కోహ్లి మీడియా సమావేశం లో చెప్పాడు . టి20 కెప్టెన్సీ వదులుకోవాలి అనుకున్నప్పుడు బీసీసీఐకి చెప్పాను.
వారినుంచి అభ్యంతరాలు రాలేదు. నా కెరీర్ లో దానిని విప్లవాత్మక మార్పుగా భావించాను. వన్డేలు, టి20లకు కెప్టెన్ గా ఉంటానని చెప్పాను. అని కోహ్లి వివరించాడు. మరోవైపు రోహిత్ శర్మను సమర్థుడైన సారథిగా పేర్కొన్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ కు సహకారం అందిస్తానని అన్నాడు.
‘‘వన్డే కెప్టెన్సీ మార్పు నిర్ణయం బీసీసీఐ ఎందుకు తీసుకుందో అర్థం చేసుకోగలను. రోహిత్ తో ఎలాంటి విభేదాలు లేవు. రెండేళ్లుగా ఇదే విషయం చెప్పిచెప్పి అలసిపోయాను. నా చర్యలు, నిర్ణయాలు జట్టు స్థాయిని దిగజార్చేలా ఉండవు’’ అని కోహ్లి స్పష్టం చేశాడు.
క్రీడల కంటే ఎవరూ గొప్పకాదు
కాగా, దీనికి ముందే కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. రోహిత్-కోహ్లి అంశంపై మాట్లాడారు. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలపై స్పందిస్తూ క్రీడల కంటే ఎవరూ గొప్ప కాదని స్సష్టం చేశారు.‘‘ ఏ ఆటలో ఏ ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతుందో చెప్పలేను. అది నా పనికాదు. క్రీడా సంఘాల పని . వారు చెబితేనే బాగుంటుంది’’ అని అన్నారు.