దేశంలోనే సంచలనం..ఐదుగురు రేపిస్టులకు ఉరి

Update: 2018-09-16 10:32 GMT
మహిళలపై అత్యాచారాలకు నిందితులకు తగిన శిక్ష పడింది. ఒకేరోజు రెండు వేర్వేరు కేసుల్లో నలుగురికి ఉరిశిక్ష పడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యాచారం చేసిన నిందితులకు ఏకంగా ఉరిశిక్ష విధించడంతో ఈప్పుడీ కేసులు హాట్ టాపిక్ గా మారాయి..

కర్ణాటక రాష్ట్రంలోని కోలూరు జిల్లా నటోరహళ్లి గ్రామంలో  2014 మే 28న పదోతరగతి విద్యార్థి పాఠశాల నుంచి ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు చుట్టుముట్టి ఆమెను బలవంతంగా చెరువులోకి లాక్కెల్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణంలో బాలిక సృహ తప్పి పడిపోయింది. దీంతో బాలిక చనిపోయిందని కామాంధులు వెళ్లిపోయారు. పోలీసులు బాలికను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు యువకులు మునికృష్ణ - నారాయణ స్వామి - అనిల్ కుమార్ - కృష్ణమూర్తిలను అరెస్ట్ చేశారు. కోర్టులో వీరి ఘాతుకం బయటపడడంతో తాజాగా నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

ఇక మాలూరు పట్టణంలో కూడా పదోతరగతి విద్యార్థిని రక్షిత పై అత్యాచార యత్నం - హత్య కేసులో కోలూరు జిల్లా కోర్టు దోషికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.  మాలూరు పట్టణానికి చెందిన విద్యార్థినిపై టీకల్ గ్రామానికి చెందిన సురేష్ కుమార్ అనే యువకుడు వెంబడించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.కానీ కుదరకపోవడంతో బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ దారుణంపై మహిళా సంఘాలు - ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా పోలీసులు కేసు నమోదు చేసి కేవలం 45 రోజుల్లోనే అన్నీ పూర్తి చేసి కోర్టులో నిరూపించారు. దీంతో నిందితుడికి ఉరిశిక్ష పడింది. ఇలా ఒకేరోజు అత్యాచార ఘటనల్లో మొత్తం ఐదుగురికి ఉరిశిక్ష పడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Tags:    

Similar News