స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన 64 డాక్యుమెంట్ లను కోల్ కతా పోలీసులు ఈ రోజు విడుదల చేయబోతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నేతాజీ డెత్ మిస్టరీ వీడుతుందేమోనని ఆసక్తిగా చూస్తున్నారు.
నేతాజీ మృతి... ఆయనపై ప్రభుత్వ నిఘా... వంటి అనేక అంశాల్లో దశాబ్దాలుగా అనుమానాలు, సందేహాలు, మిస్టరీలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా నేతాజీ మృతికి సంబంధిచిన రహస్యాలు మాత్రం వెల్లడించడం లేదు. నేతాజీ అప్పట్లో చనిపోలేదని.. ఆయన బతికే ఉన్నారని.. ఇలా రకరకాల వదంతులున్నాయి. ఈ డాక్యుమెంట్లలో దీనికి సంబంధించిన సమాచారం ఉంటుందేమోనని చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. అయితే... ఆయన మృతికి సంబంధించిన ఎలాంటి కొత్త వివరాలు కూడా ఆ డాక్యుమెంట్లలో లేవని తెలుస్తోంది.
1937 నుంచి 47 మధ్య కాలానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్లను బోస్ కుటుంబసభ్యు సమక్షంలో విడుదల చేయబోతున్నారు. విమాన ప్రమాదంలోనే నేతాజీ మరణించారా... లేదంటే ఇంకేమైనా కుట్ర జరిగిందా.. ఆయన మృతి గురించి ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలేమిటి వంటివన్నీ ఈ డాక్యుమెంట్లలో ఉంటాయని భావించినా ఆ వివరాలు అందులో లేవని సమాచారం. అయితే.. 1964 వరకు నేతాజీ జీవించే ఉన్నారని అమెరికా, పలు ఇతర దేశాల నిఘా వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వద్ద ఏదో రహస్య సమాచారం ఉందన్నది మాత్రం వాస్తవం. కానీ.... ఇప్పుడు ఈ డాక్యుమెంట్లను విడుదల చేస్తున్నది కోల్ కతా పోలీసులు కావడంతో అందులో అంతటి కీలక రహస్యాలు ఉంటాయని ఆశించడం అత్యాశే. పార్టీలకతీతంగా ప్రభుత్వాలు అధికార రహస్యంగా కాపాడుతూ వస్తున్న నేతాజీ డెత్ మిస్టరీ డాక్యుమెంట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద తప్ప ఇలా కోల్ కలా పోలీసుల వద్ద ఉండే అవకాశమే లేదు. దీంతో ఇప్పుడు విడుదల చేస్తున్న డాక్యుమెంట్లలో సాధారణ విషయాలే ఉన్నట్లు చెబుతున్నారు.