ఆ సభకు రాలేనంటూ రేవంత్ కు కోమటిరెడ్డి ఫోెన్

Update: 2021-08-13 15:37 GMT
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక...ఓ మినీ ఎన్నికను తలపించిన సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు చాలారోజుల కిందటే ఖరారైనప్పటికీ వీహెచ్, కోమటిరెడ్డి సహా పలువురు సీనియర్లు రేవంత్ ఎంపికను వ్యతిరేకిస్తుండడంతోనే అధిష్టానం వెయిటింగ్ గేమ్ ఆడిందని ప్రచారం జరిగింది. చివరకు ఆ సస్పెన్స్ కు తెర దించుతూ రేవంత్ కే పీసీసీ పగ్గాలు అప్పజెప్పడంతో సీనియర్లు అలకబూనారని టాక్ వస్తోంది.

దీంత, కోమటిరెడ్డి, వీహెచ్ వంటి సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఫోన్ చేయడం సంచలనం రేపింది. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోన్న దళిత దండోరా సభను వాయిదా వేసుకోవాలని కోమటిరెడ్డి కోరడం చర్చనీయాంశమైంది. ఈ నెల 18న పార్లమెంటరీ స్టడీ టూర్‌కు వెళ్లాల్సి ఉన్నందున సభకు తాను హాజరు కాలేనని వెల్లడింారు.

అయతే, కోమటిరెడ్డి రిక్వెస్ట్ ను రేవంత్ అంగీకరించి సభను వాయిదా వేస్తారా? కొనసాగిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఇంద్రవెల్లిలో సభ విజయవంతం కావడంతో...ఇబ్రహీం పట్నంతోపాటు మరో 3 చోట్ల దళిత దండోరా నిర్వహించి హుజురాబాద్ ఉప ఎన్నికలో గట్టి పోటీ ఇవ్వాలని రేవంత్ భావించారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి ఇలా సభ వాయిదా వేయాలని కోరడంపై రేవంత్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, పైకి ఈ కారణం చెబుతున్నా...కోమటిరెడ్డి అంతర్మథనంలో వేరే కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. రేవంత్ తో కలిసి పనిచేయడానికి కోమటిరెడ్డి సహా పలువురు సీనియర్లు సిద్ధం అంటూనే....ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు పొడిపొడిగా మాట్లాడుకుంటున్నా....ఇంద్రవెల్లి సభకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. తన సొంత నియోజకవర్గం అయిన ఇబ్రహీం పట్నంలో సభపెడితే కోమటిరెడ్డి తప్పక హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు, ఇబ్రహీంపట్నంలో  సభకు  కేసీఆర్ సర్కార్ అనుమతినివ్వలేదు. ఈ రెండు కారణాల నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తోంది.
Tags:    

Similar News