ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ కుటిల రాజకీయం గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం ఓటింగ్ సమయంలో తెలంగాణ ఎంపీ వినోద్ చేసిన వ్యాఖ్యలతో....హోదాపై తెలంగాణ వైఖరి తేట తెల్లమైంది. దానికి తోడు - ఏపీకి ఇచ్చే ప్రతీ రాయితీ....తెలంగాణకూ ఇవ్వాలని..... పరిశ్రమలకు పన్ను రాయితీ కూడా ఇవ్వాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మనకు.... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సోనియా ఆనాడు చెప్పారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాజకీయ లబ్ది కోసమేనని హరీష్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో హాదా అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
గురువారం నాడు తిరుమల వెంకన్నను కోమటి రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై మీడియాతో మాట్లాడారు. ఏపీకి హోదా తప్పక ఇవ్వాలని - అందుకు అనుగుణంగా కేంద్రంలోని పాలకుల కళ్లు తెరిపించాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు కోమటి రెడ్డి తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ఎంపీ కవిత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన విషయాన్ని కోమటిరెడ్డి గుర్తుచేశారు. ఏపీతో పాటు తెలంగాణకూ విభజన చట్టాలు అమలు చేయాలని ఆయన కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు అంశంపై రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మరోవైపు, తెలంగాణలో టీఆర్ ఎస్ కు కొరకరాని కొయ్యలుగా తయారైన రేవంత్ - కోమటి రెడ్డి - డీకే అరుణలకు రాబోయే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు గులాబీ అధినేత కేసీఆర్ వ్యూహ రచన చేస్తోన్న సంగతి తెలిసిందే.