తెలంగాణ రాజకీయాల్లో కరెంటు మంటలు పుట్టిస్తోంది! అధికార - ప్రతిపక్షాల మధ్య విద్యుత్ కేంద్రంగా వాడివేడి విమర్శలు సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో..అధికార పార్టీ తమ ఘనత అని ప్రకటించుకుంటుంటే....ప్రతిపక్ష కాంగ్రెస్ దీన్ని హస్తం పుణ్యమని చెప్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు తమదైన శైలిలో రియాక్టవుతున్నారు. తాజాగా సీఎల్పీ ఉపనేత - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పునర్విభజన చట్టం రూపొందే సమయంలో కాంగ్రెస్ పోరాటం వల్లే 53 శాతం విద్యుత్ తెలంగాణ కేటాయించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 53 శాతం కేటాయించడం వల్లే తెలంగాణకు విద్యుత్ ఉందన్నారు. టీఆర్ ఎస్ పార్టీ - ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ స్కీం రూపొందించినా అందులో స్కాం ఉంటుందని ఆరోపించారు. అవినీతి లేనిది కేసీఆర్ ప్రభుత్వం ఏ పనీ చేయదని సంచలన వ్యాఖ్యలు చేశారు. `అధికారులు వద్దన్న సీఎం చత్తీస్ ఘడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల్లో సీఎం కేసీఆర్ కు వాటా ఉంది.` అని ఆరోపించారు. 24గంటలు విద్యుత్ ఇవ్వడంలో మోసం దాగి ఉందని ఆయన ఆరోపించారు. విద్యుత్ స్కామ్ పై చర్చకు ఎవరు వచ్చినా... ఎక్కడికి వచ్చినా తాను సిద్ధమని ప్రకటించారు. పవర్ లేని పవర్ మినిస్టర్ తో నాకవసరంలేదని ఎద్దేవా చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో స్కామ్ జరిగింది. ఈ విషయంలో నా మాట తప్పు అని తేలితే నేను రాజకీయాలను వదులుకుంటా. స్పీకర్ కు నేరుగా నా రాజీనామా ఇస్తా.స్కాంపై ఓపెన్ గా సీఎం కేసీఆర్ ఒప్పుకోవాలి. స్కాంను నేను ప్రూవ్ చేసేందుకు సిద్ధం. ఇందులో ఎలాంటి కుంభకోణం లేదని సీఎం కేసీఆర్ ప్రూవ్ చేసుకోవాలి. ఇకనైనా మోసం ఆపాలి` అని కోమటిరెడ్డి ప్రకటించారు. జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావును పంపినా...చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు.
యాదాద్రి ప్లాంట్ నిర్మాణంలో 32వేల కోట్ల వర్క్ ను...నామినేషన్ పై ఇచ్చారని కోమటిరెడ్డి ఆరోపించారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా అనుమానాలు వ్యక్తంచేశారని తెలిపారు. `ఇంత పెద్ద పనులను ప్రైవేట్ వాళ్లకు కాకుండా ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాలని చెప్తూనే...బీహెచ్ ఈఎల్ సంస్థలకు మొత్తం పనుల్లో 50శాతం పనులు అంటే...16వేల కోట్ల పనులను మాత్రమే ఇచ్చారు. మిగిలినవి ప్రైవేట్ వాళ్లకు ఇచ్చారు. హడావుడిగా సోలార్ ప్రాజెక్టులో 500 మెగావాట్ల కోసం టెండర్లను పిలిచారు. సీఎం వాటా చెప్పిన తర్వాత అధికారులు వద్దన్నా వాళ్ళనే సీఎం వాళ్ళనే పిలిచారు. 25 ఏళ్ళ వరకు ఒప్పందం చేసుకున్నారు.. యాదాద్రి పవర్ ప్రాజెక్టుతో ప్రజలపై రూ.4000 కోట్ల భారం పడుతుంది. అందుకే సోలార్ టెండర్లు రద్దు చేయండి` అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.